నవతెలంగాణ – ఊరుకొండ
ఊరుకొండ మండల కేంద్రంతో పటు మండల పరిధిలోని అన్ని గ్రామాలలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా జరుపుకున్నారు. మంగళవారం ఊరుకొండ మండల కేంద్రంలోని స్థానిక పోలీస్ స్టేషన్లో ఎస్సై డీ.లెనిన్, ఎంపీడీవో కార్యాలయం పై ఎంపీపీ బక్కరాద జంగయ్య, అంగన్ వాడి కేంద్రంపై అరుణమ్మ, నేతాజీ చౌక్ వద్ద సుభాష్ చంద్రబోస్ విగ్రహం వద్ద మాజీ సర్పంచ్ శ్రీనివాసులు, తాసిల్దార్ కార్యాలయం వద్ద తాసిల్దార్ చెన్న కిష్టన్న, శ్రీ వెంకట బాల్ రామయ్య హై స్కూల్ వద్ద కరస్పాండెంట్ సామల బాలరాజు, ఊరుకొండ ప్రభుత్వ పాఠశాల వద్ద హెచ్ఎం బాలయ్య, కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మండల అధ్యక్షుడు తిరుపతిరెడ్డి, టిఆర్ఎస్ ఆధ్వర్యంలో మండల అధ్యక్షుడు వీరారెడ్డి, వివిధ ప్రభుత్వ కార్యాలయాలు, ప్రభుత్వ పాఠశాలలు, గ్రామపంచాయతీ ల వద్ద సర్పంచులు జాతీయ జెండాను ఎగురవేశారు. కార్యక్రమంలో ఆయా గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, రెవెన్యూ అధికారులు, ఎంపీడీవో కాయల సిబ్బంది, వివిధ పార్టీల నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ప్రజలు తదితరులు పాల్గొన్నారు.