పదోతరగతి విద్యార్థులకు స్కాలర్ షిప్ అందజేత..

నవతెలంగాణ-డిచ్ పల్లి : డిచ్ పల్లి మండలంలోని రాంపూర్ డి పాఠశాలలో బయోజం పురుగుల మందుల కంపెనీ పదో తరగతి విద్యార్థులు పదిమందికి 2500 ఇంకోక్కరి చొప్పున 25వేల రూపాయల స్కాలర్షిప్ లను మంగళవారం పంపిణీ చేసినట్లు ఉప సర్పంచ్ యెంకనోల్ల రమేష్ తెలిపారు.బయోజం కంపెనీ నిజామాబాద్ లో ప్రతి ఏటా పది మందికి విద్యార్థులకు  నిజామాబాద్ లోని ఆయా గ్రామాలలో ని ప్రభుత్వ పాఠశాలల్లో అందజేస్తున్నరని దానిలో భాగంగానే ఈ సారి రాంపూర్ డి లో అందజేసినట్లు రమేష్ వివరించారు. రాంపూర్ గ్రామంలో ఉన్న లక్ష్మీనరసింహ ఫర్టిలైజర్ తరపున రమేష్ స్కాలర్ షిప్ ఇప్పించడం లో ప్రత్యేక కృషి చేశారు.  ఈ కార్యక్రమంలో సర్పంచ్ పాపాయి తిరుపతి, ఎంపీటీసీ పోతర్ల సుజాత రవి, విడిసి అధ్యక్షులు రాజ్ కుమార్, సహకార సొసైటీ చైర్మన్ తరచంద్ నాయక్,  వసుధ ఆగ్రో ప్రైవేట్ లిమిటెడ్ ప్రతినిధి గంగాధర్, సంపత్,  బయోజం కంపెనీ సేల్స్ ఆఫీసర్ కిరణ్ కుమార్ రెడ్డి తోపాటు అధ్యాపకులు, గ్రామస్తులు పాల్గొన్నారు.
Spread the love