లండన్‌లో ఘనంగా స్వాతంత్య్ర దినోత్సవ సంబురాలు

Independence Day celebrations in London– తెలంగాణ రాష్ట్ర ఎన్నారైల భాగస్వామ్యంతో నిర్వహణ
లండన్‌ : యూకే లో ఉన్న వివిధ సంఘాల సంయుక్త , లండన్‌ ఇండియన్‌ హై కమిషన్‌ సహకారం తో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు . హైకమిషనర్‌ విక్రమ్‌ కె.దొరైస్వామి భారత జాతీయ త్రివర్ణ పతాకాన్ని ఎగురవేయ డంతో ఈ కార్యక్రమం ప్రారంభమైంది. చంద్రయాన్‌ 3 విజయవం తం చేసిన ఇస్రో శాస్త్రవేత్తలకు ,సభ్యులకు భారత జాతి కి అభినందన లు తెలిపారు. ఇండియా అభివృద్ధి లో యూకే ప్రవాస భారతీయుల ందరు అగ్రభాగాన నిలవాలని పిలుపునిచ్చారు . కార్యక్రమం లో వివిధ రాష్ట్రాల వేదికలు ఏర్పాటు చేసి ,ఆయా రాష్ట్రాల సంస్కృతి ,ఆచారాలు,చరిత్ర అంశాలని తెలిపే స్టాల్స్‌ ఏర్పాటు చేసారు ,వివిధ రాష్ట్రాల నుంచి సాంస్కృతిక ,నృత్య ప్రదర్శన లు చేశారు .
తెలంగాణ భాగస్వామ్యం
తెలంగాణ రాష్ట్రం తరఫున తెలంగాణ ఎన్నారై ఫోరమ్‌ గత తొమ్మిదేండ్లుగా భాగస్వామ్యమవుతూ వస్తుందని తెలంగాణ ఎన్నారై ఫోరమ్‌ అధ్యక్షులు ప్రమోద్‌ గౌడ్‌ అంతరి తెలిపారు ,తెలంగాణ స్టాల్‌ లో కాకతీయ తోరణం ఏర్పాటు చేసి ,రామప్ప గుడి ,వెయ్యిస్తంభాల చరిత్ర ,గోల్కొండ ఖిలా,హైదరాబాద్‌ ముత్యాలు ,బిర్యానీ ల పై తెలంగాణ సంస్కృతి ,చరిత్ర లని ప్రదర్శన చేశారు .
తెలంగాణ జానపద గేయాల పై నృత్య ప్రదర్శన
తెలంగాణ సంస్కతి ఉట్టిపడేలా తెలంగాణ జానపదం ,బతుకమ్మ ,బోనాలు పండుగల పై యశస్విని ధనంనేని, రితి శ్రీ ధనంనేని ,అచిత వరకాల లు నృత్య ప్రదర్శన చేసి సందర్శకులతో తెలంగాణ స్ఫూర్తి ని నింపారు వ్యవస్థాపాక సభ్యులు రంగుల సుధాకర్‌ గౌడ్‌ కాకతీయ స్టాల్‌ ని సందర్శించిన హైకమిషనర్‌ .విక్రమ్‌ కె.దొరైస్వామి ని సన్మానించారు .విచ్చేసిన సభికులందరికీ హైదరాబాద్‌ ధం బిర్యానీ పెట్టి.. హైదరాబాద్‌ ఖానా ని రుచి చూపించారు. తెలంగాణ స్టాల్‌ ఏర్పాట్లలో వ్యవస్థాపక చైర్మన్‌ గంప వేణుగోపాల్‌ , కోర్‌ కమిటీ సభ్యులు మీనా అంతరి ,శౌరీ గౌడ్‌ ,జయశ్రీ పెద్ది లు చొరవతో ఈ కార్యక్రమం విజయమైంది.

Spread the love