అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం భారతదేశం

– బీఆర్ఎస్ పార్టీ రాజ్యసభ పక్ష నేత కేఆర్ సురేష్ రెడ్డి 

– చౌట్ పల్లిలో కుటుంబ సభ్యులతో కలిసి ఓటేసిన సురేష్ రెడ్డి 
 నవతెలంగాణ కమ్మర్ పల్లి
ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం భారత దేశమని బీఆర్ఎస్ పార్టీ రాజ్యసభ పక్ష నేత కేఆర్ సురేష్ రెడ్డి అన్నారు. సోమవారం మండలంలోని చౌట్ ల్లి మండల పరిషత్ ప్రాథమికోన్నత బాలికల పాఠశాలలో 134వ పోలింగ్ కేంద్రంలో ఓటర్లతో కలిసి వరుసలో నిలబడి  ఆయన తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా సురేష్ రెడ్డి మాట్లాడుతూ ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం భారతదేశమని, ఈరోజు నిజంగా ప్రజా జీవితంలో ఉన్న తనలాంటి వారికి ఎంతో సంతోషంగా ఉందన్నారు. అతి పెద్ద ప్రజాస్వామ్య దేశంలో ఉత్సాహంగా ప్రజలు ఓటు హక్కు వినియోగించుకుంటున్నారని, తద్వారా ప్రజాస్వామ్యం బలపడుతుందని ధైర్యం, విశ్వాసం కలుగుతుందన్నారు. ఉదయం ఏడు గంటలకు ప్రారంభమైన ఓటింగ్ పర్సంటేజ్ బాగుందన్న ఆయన చిన్న చిన్న సమస్యలు ఉన్న కొందరికి వ్యవసాయ పనులు, కూలి పనులు ఉన్న పక్కనపెట్టి ఓటింగ్ లో  సంతోషంగా ఉందన్నారు. పోలింగ్ కేంద్రాల్లో అన్ని సౌకర్యాలు బాగున్నాయని అప్పుడప్పుడు కరెంటు పోతున్న అయినప్పటికీ ఓటర్లు నిరాశ పడకుండా ముందుకు వచ్చి ఓటింగ్ వేస్తున్నారు అన్నారు.  అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంలో వారి హక్కులు ఎలా ఉపయోగించుకుంటున్నారని  ప్రపంచం అంతా మన వైపు చూస్తుందన్నారు. మారుమూల చౌటుపల్లి గ్రామంలో ఉత్సాహంగా మహిళలు యువకులు, పెద్దలు రైతు కూలీలు కలిసికట్టుగా తరలివచ్చి ఓటు వినియోగించుకోవడం ప్రజాస్వామ్య విజయమన్నారు. అంతకుముందు ఇదే పోలింగ్ కేంద్రంలో సురేష్ రెడ్డి సతీమణి పద్మజా రెడ్డి తన ఓటు హక్కు వినియోబీగించుకున్నారు.ఆయన వెంట బీఆర్ఎస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు నవీన్ గౌడ్, నాయకులు గోపిడి లింగారెడ్డి, అల్లకొండ రాజన్న, తదితరులు ఉన్నారు.
Spread the love