మొరాకోపై భారత్‌ గెలుపు

India win over Morocco– విజయంతో రోహన్‌ బోపన్న వీడ్కోలు
లక్నో : డెవిస్‌ కప్‌కు రోహన్‌ బోపన్న ఘనంగా వీడ్కోలు పలికాడు. డెవిస్‌ కప్‌ వరల్డ్‌ గ్రూప్‌ 11 టైలో మొరాకోపై టీమ్‌ ఇండియా 3-1తో ఘన విజయం సాధించింది. యూకీ బాంబ్రితో కలిసి డబుల్స్‌లో బరిలోకి దిగిన వెటరన్‌ ఆటగాడు రోహన్‌ బోపన్న..6-2, 6-1తో వరుస సెట్లలో విజయం సాధించాడు. రివర్స్‌ సింగిల్స్‌ మ్యాచ్‌లో సుమిత్‌ నాగల్‌ మెరిశాడు. రివర్స్‌ రబ్బర్‌ను 6-3, 6-3తో అలవోకగా గెలుపొందిన సుమిత్‌ నాగల్‌ భారత్‌ విజయానికి బాటలు వేశాడు. ఈ విజయంతో వచ్చే ఏడాది డెవిస్‌ కప్‌ వరల్డ్‌ గ్రూప్‌ 1 ప్లే ఆఫ్స్‌కు భారత్‌ అర్హత సాధించింది.

Spread the love