అమెరికాలో భారత సంతతి వైద్యుడి అరెస్టు

indian-origin-doctor-arrested-in-americaనవతెలంగాణ – న్యూయార్క్‌: విమానంలో ప్రయాణిస్తున్న సమయంలో బాలిక ఎదుట అసభ్యకర చేష్టలకు పాల్పడిన భారత సంతతి వైద్యుడు సుదీప్త మొహంతి(33)ని పోలీసులు గురువారం అరెస్టుచేశారు. అనంతరం ఆయన్ను ఫెడరల్‌ న్యాయస్థానంలో ప్రవేశపెట్టి కొన్ని ఆంక్షలు విధిస్తూ విడుదల చేశారు. ఇంటర్నల్‌ మెడిసిన్‌, ప్రైమరీ కేర్‌ వైద్యుడైన మొహంతి గతేడాది మే నెలలో తన స్నేహితురాలితో కలిసి హోనోలులు నుంచి బోస్టన్‌ వస్తున్నారు. అదే విమానంలో 14 ఏళ్ల బాలిక తన తాత, మామ్మలతో కలిసి ప్రయాణించింది. మొహంతి పక్క సీటులో కూర్చుంది. విమానం గాల్లో ప్రయాణిస్తుండగా.. మొహంతి అసభ్యకర చేష్టలకు పాల్పడుతున్న సంగతిని గమనించిన ఆమె వెంటనే వేరే లైనులోని ఖాళీ సీటులోకి వెళ్లిపోయింది. విమానం బోస్టన్‌లో దిగిన తర్వాత తాత మామ్మలతోపాటు విమానయాన సిబ్బందికి ఫిర్యాదు చేసింది. దీంతో అధికారులు మొహంతిపై కేసు నమోదు చేశారు. విమాన ప్రయాణంలో అసభ్యకర చర్యలకు పాల్పడితే అమెరికా చట్టాల ప్రకారం 90 రోజుల జైలు శిక్ష, ఏడాదిపాటు పర్యవేక్షణతో కూడిన విడుదల, సుమారు రూ.4.15 లక్షల జరిమానా విధిస్తారు.

Spread the love