ప్రజావాణిలో కలెక్టర్ కు బీఆర్ఎస్ నాయకుల వినతి
నవతెలంగాణ – మల్హర్ రావు
మండలంలో అన్ని గ్రామాల్లో అర్హులైన పేదలకు ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయాలని బిఆర్ఎస్ నాయకులు సోమవారం ప్రజావాణిలో భూపాలపల్లి జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మకు వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశ పెట్టిన ఇందిరమ్మ ఇండ్ల విషయంలో మండలంలోని ఆయా గ్రామాల్లో అధికారులు పర్యవేక్షణ చేసి అసలైన అర్హులను గుర్తించి ఇండ్లు మంజూరు చేయాలని కోరారు. ఇందిరమ్మ కమిటీ మెంబర్లు తమకు అనుకూలంగా ఉన్నవారికి మాత్రమే ఇండ్ల లిస్టులు రాసి పంపునట్లుగా ఆరోపించారు. గ్రామాల్లో మొదటి విడతగా మంజురైన ఇండ్ల జాబితాలను ఇవ్వాలని సంబంధించిన అధికారులను అడిగినా ఇవ్వడం లేదని వాపోయారు. ఇప్పటికైనా మంజురైన జాబితాలను ఆయా గ్రామపంచాయతీల్లోని నోటీస్ బోర్డుల్లో పెట్టించాలని కోరారు. కార్యక్రమంలో బిఆర్ఎస్ నాయకులు నౌళ్ళ సంపత్, ఇనుముల సతీష్, ఢిల్లీ రాజు, మంథని సమ్మయ్య, పులిగంటి రాములు, వేముల శ్రీశైలం, మామిడాల రాము పాల్గొన్నారు.
అర్హులైన పేదలకు ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయాలి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



