ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి
నవతెలంగాణ-నాచారం
తెలంగాణ ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలిచిన గులాబీ జెండా రాష్ట్ర ప్రజల గర్వకారణమని ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి తెలిపారు. అలుపెరగని పోరాటంతో ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన ఈ చారిత్రక జెండా, సంక్షేమం మరియు అభివృద్ధి దిశగా రాష్ట్రాన్ని దేశంలో అగ్రగామిగా నిలిపిందని పేర్కొన్నారు. భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని, ఉప్పల్ నియోజకవర్గంలోని మల్లాపూర్ డివిజన్‌లో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో జెండా ఆవిష్కరణ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి గులాబీ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాజీ కార్పొరేటర్ పన్నాల దేవేందర్ రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణ ఉద్యమ స్ఫూర్తిని కొనసాగిస్తూ ప్రజా సంక్షేమం కోసం బీఆర్ఎస్ పార్టీ కట్టుబడి పనిచేస్తోందన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు తీగుళ్ల శ్రీనివాస్ గౌడ్, కుంటి కృష్ణ, వాసుదేవ్ గౌడ్, ప్రవీణ్, శ్రీనివాస్ నెల్లుట్ల, మల్లేష్, ఉస్మాన్, దయాకర్ రెడ్డి, గణేష్, రాజేష్, రఘువరన్, కృష్ణ గౌడ్, శ్రవణ్ (బీఆర్ఎస్ యూ), రిజ్వాన్, రాపోలు శ్రీనివాస్, ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు.



