సామాజిక ఆరోగ్య కేంద్రంలో డయాలసిస్ ప్రారంభం….

– ఆసుపత్రిని సందర్శించిన అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు….
– కల సాకారం అయిన వేళ…
– హర్షం వ్యక్తం చేస్తున్న పట్టణ వాసులు…

నవతెలంగాణ – అశ్వారావుపేట
స్థానిక సామాజిక ఆరోగ్య కేంద్రంలో అందించాల్సిన సేవలు కోసం ఎన్నో ఏళ్ళుగా ఈ ప్రాంతవాసులు ఎదురు చూసారు.ఎట్టకేలకు ఆ సేవలు ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు కృషి,గిరిజన ప్రాంతంలో  సేవలు అందించాలనే కలెక్టర్ అనుదీప్ సంకల్పం,త్వరితగతిన సేవలు అందుబాటులోకి తేవాలని డీ.సీ.హెచ్.ఎస్ రవిబాబు ఆతృత ఫలితంగా ఈ సేవలు  అందుబాటులోకి రావడంతో పట్టణ వాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. బుధవారం దమ్మపేట కు చెందిన మూత్రపిండ సంబంధిత బాధితుడికి సామాజిక ఆరోగ్య కేంద్రంలో ప్రధాన వైద్యులు పూర్ణ చంద్రరావు పర్యవేక్షణలో  మొదటి సారి ప్రారంభించారు. ఎన్నికల ప్రక్రియ విధులు పై అశ్వారావుపేట వచ్చిన అదనపు కలెక్టర్ కె.వెంకటేశ్వర్లు ఆసుపత్రిని సందర్శించిన అక్కడ అందజేస్తున్న అదనపు వైద్య సేవలు ను అడిగి తెలుసుకున్నారు.
Spread the love