భద్రతను కోల్పోతున్న యువత

భద్రతను కోల్పోతున్న యువతటీనేజ్‌ పిల్లలు మాట వినరు… మార్కులు రావడం లేదు… ఫియర్‌ ప్రెజర్‌…. కన్ఫ్యూజన్‌లో ఉంటారు… సైలెంట్‌ లేదా 12-20 ఏండ్ల మధ్య సెక్స్‌ ఎడ్యుకేషన్‌ లేకపోవడం వల్ల వికాసం కుంటుపడుతుంది.
ఉరకలెత్తే ఉత్సాహం నిండి ఉండే టీనేజర్లను ప్రస్తుత పరిస్థితి విపరీతమైన అసహనానికి లోను చేస్తోంది. విద్యాసంవత్సరం వథా అవుతుందేమో అనే భయం ఓ పక్క, చదువు పూర్తయినా కెరీర్‌ ఎలా ఉండబోతుందో అనే ఆందోళన మరో పక్క 16 నుంచి 22 ఏళ్ల వయసు యవతను మానసికంగా కుంగదీస్తున్నాయి. రాత్రుళ్లు ఎక్కువ సమయాలు మేలుకోవడం వల్ల హార్మోన్లలో అవకతవకలు చోటుచేసుకోవడం, ఫలితంగా ఆడపిల్లల నెలసరిలో హెచ్చుతగ్గులు చోటుచేసుకుంటాయి. మెదడులో విడుదలయ్యే రసాయనాల్లో హెచ్చుతగ్గుల వల్ల భావోద్వేగాల్లో తీవ్ర మార్పులూ చోటుచేసుకుంటాయి. దీనికితోడు తమలో లోపించిన ఉత్సాహాన్ని నింపుకోవడం కోసం తాత్కాలిక ఆనందాలకు ఆకర్షితులవుతారు. హద్దులు దాటిన ఆలోచనలతో ఒత్తిడి పెరిగి యువత ఆత్మహత్యలకూ పాల్పడే వీలుంది. చిన్న విషయాలకే చికాకు పడడం, కోపంతో అరవడం, వస్తువులను విసిరేయడం, అరుదుగా కొందరు గాయాలు చేసుకోవడం కూడా చేస్తారు.
ఏదైనా ఊహించని పరిస్థితి ఎదురైనప్పుడు మొదట అసహనానికి లోనవుతారు. కోపం తెచ్చుకుంటారు, దిగాలు పడతారు! చివరకు రాజీపడి సర్దుకు పోతారు! అయినా ప్రతి ఒక్కరిలో ఎంతో కొంత కుంగుబాటు, ఒత్తిడి, ఆందోళనలు ఉంటూనే ఉన్నాయి. జీవనశైలి ప్రభావంతో చదువులు గాడి తప్పుతున్నాయి. ఫలితంగా పిల్లల్లో పలురకాల మానసిక భావోద్వేగాలు చోటుచేసుకుంటున్నాయి.
పిల్లలు టైమ్‌టేబుల్‌ని అనుసరించేలా చేయాలి. ఉదయాన్నే నిద్ర లేవడం మొదలు, భోజన వేళలు, తరగతులు, ఆటలు, నిద్ర వేళలు క్రమంతప్పకుండా పాటించేలా చూడాలి. పెద్దలు తప్పనిసరిగా పిల్లలకు సమయాన్ని కేటాయిస్తూ, వారి మనోభావాలు తెలుసుకునే ప్రయత్నం చేయాలి. వాళ్లతో కబుర్లు చెబుతూ, వారి మనసులోని భావాలు మాటల్లో వ్యక్తం చేయగలిగేలా ప్రోత్సహించాలి. పిల్లలకు ఆదర్శంగా నిలుస్తూ స్క్రీన్‌ టైమ్‌ తగ్గించుకోవాలి. ఇంట్లో ఆడుకునే ఆటలు ఆడిస్తూ, వారిని ఇంటి పనుల్లోనూ భాగస్వాములను చేయాలి. ప్రస్తుతం సంగీతం, నాట్యం, డ్రాయింగ్‌లను నేర్పించండి. ఇలా పెద్దలు పిల్లలతో స్నేహితుల్లా వ్యవహరిస్తూ, వారిలో ఆత్మవిశ్వాసం నింపాలి.హొ
ప్రస్తుత సమయంలో పెద్దలు పిల్లలకు దూరంగా ఉండడం సరికాదు. కాబట్టి పిల్లలు తమ తల్లితండ్రులతో కలిసి ఉండేలా ఏర్పాట్లు చేసుకోవాలి. అన్నిటికంటే ఎక్కువగా మేం మీకు తోడున్నాం! అనే భద్రత కల్పించాలి. సెక్స్‌ ఆలోచనల గురించి మాట్లాడండి.
పెద్దలు పిల్లల్లో కనిపించే మార్పులను నిర్లక్ష్యం చేయకుండా మానసిక నిపుణుల దష్టికి తీసుకువెళ్లాలి. పిల్లలు ఎక్కువ సమయం ఒంటరిగా గడుపుతున్నా, బద్ధకంతో, ఏ పని మీదా ఆసక్తి లేనట్టు వ్యవహరిస్తున్నా ఆలస్యం చేయకుండా మానసిక నిపుణులను కలవడం మేలు. కౌన్సెలింగ్‌తో యువతలో నెలకొనే మానసిక కుంగుబాటును సరిదిద్దగలుగుతారు.

డా|| హిప్నో పద్మా కమలాకర్‌
9390044031
కౌన్సెలింగ్‌, సైకో థెరపిస్ట్‌,
హిప్నో థెరపిస్ట్‌

Spread the love