అల్లూరు చెరువు దారికి సోలార్ లైట్ల ఏర్పాటు

– అల్లూరు గ్రామస్థుల దశాబ్ధాల కళ సాకారం చేసిన కార్పొరేటర్ బాధే అంజలీదేవి
నవతెలంగాణ-యైటింక్లైన్ కాలనీ: రామగుండం మండలం అల్లూరు గ్రామ చెరువుకు సోలార్ లైట్లు వచ్చాయి.ఎన్నో ఏండ్లుగా గ్రామ మహిళలు బతుకమ్మలను నిమజ్జనం చేయడానికి,పొలం పనుల నిమిత్తం వెళ్లే రైతుల ఇబ్బందులను గుర్తించిన 18వ డివిజన్ కార్పొరేటర్ బాధే అంజలీదేవి సింగరేణి యాజమాన్యంతో మాట్లాడి సింగరేణి ప్రభావిత గ్రామమైన అల్లూరు చెరువుకు వీది ద్వీపాలు ఏర్పాటు చేయాలని కోరారు.దీంతో స్పందించిన సింగరేణి యాజమాన్యం మంగళవారం అల్లూరు చెరువుకు వెళ్లే దారిలో సోలార్ విద్యుత్ ద్వీపాలను ఏర్పాటు చేశారు.ఎన్నో ఏండ్లుగా ఈ దారి గుండా రాత్రులు వెళ్లాలంటేనే భయపడుతున్న మహిళలు,రైతులు సోలార్ లైట్ల ఏర్పాటుతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
Spread the love