షిండే – బీజేపీ సర్కార్‌లో అంతర్గత పోరు?

నవతెలంగాణ ముంబయి: మహారాష్ట్రలో అధికారంలో ఉన్న షిండే – బీజేపీ కూటమిలో అంతర్గత పోరు మొదలైనట్టు తెలుస్తోంది. స్వప్రయోజనాల కోసం కొందరు నాయకులు ప్రభుత్వానికి అడ్డంకులు సృష్టిస్తున్నారంటూ జీజేపీ నేతలను ఉద్దేశించి స్వయనా రాష్ట్రముఖ్యమంత్రి కుమాకుఉడ ఏక్‌నాథ్‌ షిందే కుమారుడు ఎంపీ శ్రీకాంత్‌ షిండే తీవ్ర ఆరోపణలు చేశారు. ‘‘రాష్ట్రంలోని డోంబివిల్‌ ప్రాంతానికి చెందిన కొందరు నాయకులు వారి రాజకీయ లబ్ధి కోసం శివసేన-బీజేపీ కూటమికి అడ్డంకులు సృష్టిస్తున్నారు. ఈ కూటమిని కొనసాగిస్తూ రాబోయే ఎన్నికల్లోనూ అధికారంలోకి రావడమే లక్ష్యంగా పనిచేస్తున్నాం. మా పనిని ఎవరైనా వ్యతిరేకించినా.. అడ్డంకులు సృష్టించినా నా పదవికి నేను రాజీనామా చేస్తా. నాకు పదవులపై వ్యామోహం లేదు. నా స్థానంలో కూటమి సీనియర్‌ నాయకుల నిర్ణయం మేరకు ఎవరిని తీసుకొచ్చినా వైదొలుగుతా’’అని శ్రీకాంత్‌ జాతీయ మీడియాకు తెలిపారు. వచ్చే ఎన్నికల్లో శివసేన- బీజేపీ కలిసి పోటీ చేస్తాయని సీఎం ఏక్‌నాథ్‌ షిండే ఇటీవల ప్రకటించారు. దేశంలో మహారాష్ట్రను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి నంబర్‌ 1 రాష్ట్రంగా తీర్చిదిద్దుతామని తెలిపారు. ఆ ప్రకటన వెలువడిన కొన్ని రోజులకే శ్రీకాంత్‌ ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం.

Spread the love