గురుకుల ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం..

నవతెలంగాణ – నసురుల్లాబాద్
నసురుల్లాబాద్ గిరిజన గురుకుల కళాశాలల్లో ఇంటర్మీడియట్‌ ప్రవేశాలకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపాల్‌ వెంకట రమణ తెలిపారు. బుదవారం నసురుల్లాబాద్ గిరిజన గురుకుల పాఠశాల ప్రిన్సిపాల ప్రెస్ నోట్ విడుదల చేశారు.. గిరిజన బాలుర గురుకుల కళాశాల నసురుల్లాబాద్ యందు సి.ఇ.సి, యచ్.ఇ.సి మరియు ఏ అయిండ్ టి గ్రూప్ లకు  మొదటి సంవత్సరం గ్రూపుల యందు ఖాళీలు కలవని తెలిపారు. ఈ నెల 15 నాటికి ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరంలో చేరుటకు అడ్మిషన్స్ డేట్ ముగియనున్నది. కావున విద్యార్థులు ఆన్ లైన్ ద్వారా త్వరగా రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిందిగా కళాశాల ప్రిన్సిపాల్ వెంకట్ నారాయణ ప్రకటన ద్వారా తెలియజేయడం జరిగింది. ఇందులో ఉచిత నాణ్యమైన విద్య, ఉచిత భోజనం, దుస్తులు మరెన్నో సౌకర్యాలు గలా గురుకుల పాఠశాలలో దరఖాస్తులు చేసుకోవాలని సూచించారు. పదవ తరగతి ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులు 2023-24విద్యా సంవత్సరానికి గాను తమ దరఖాస్తులను ఆన్‌లైన్‌ ద్వార దరఖాస్తులు, 100రూపాయల ఫీజు చెల్లించాలన్నారు. ఈ నెల 15 లోగా దరఖాస్తు చేసుకోవాలన్నారు.

Spread the love