రియల్ ఎస్టేట్ వ్యాపారి ఇంటి ముందు రైతుల ధర్నా
రూ.11 కోట్లు అప్పు తీసుకొని మోసం
నవతెలంగాణ-కోదాడ టౌన్
రైతుల నుంచి రూ.11 కోట్ల అప్పు తీసుకొని ఓ రియల్ ఎస్టేట్ వ్యాపారి మోసం చేయడంతో బాధితులు ధర్నాకు దిగారు. వ్యాపారి ఇంటి ఎదుట బైటాయించారు. తమ కష్టార్జితం వెంటనే ఇవ్వాలని 60 మంది ఆందోళన చేశారు. ఈ ఘటన సూర్యాపేట జిల్లా కోదాడలో మంగళవారం వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకెళితే.. కోదాడ సమీపంలోని శ్రీరంగపురంలో ఇరిగేలా జితేందర్‌రెడ్డి రియల్ ఎస్టేన వ్యాపారి. సుమారు 60 మంది రైతుల నుంచి సుమారు రూ.11 కోట్ల అప్పు తీసుకున్నాడు. ఆ అప్పులు తిరిగి చెల్లించకుండా ఐపీ (దివాలా) నోటీసులను సదరు రైతులకు పంపాడు. దీంతో రైతులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. వ్యవసాయంలో వచ్చిన కొద్దిపాటి సంపాదనను జితేందర్‌రెడ్డికి ఇచ్చామని, తమను ఆదుకోవాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు. తమకు రావాల్సిన సుమారు 11 కోట్ల రూపాయలను తక్షణమే ఇప్పించాలంటూ సదరు రియల్ ఎస్టేట్ వ్యాపారి జితేందర్‌రెడ్డి ఇంటి ఎదుట మంగళవారం టెంట్ వేసుకుని బైటాయించారు.
వ్యవసాయ పెట్టుబడుల కోసం, పిల్లల పెళ్లిళ్ల కోసం దాచుకున్న డబ్బులు వ్యాపారి తిరిగి ఇవ్వకపోవడంతో తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్టు ఆవేదన వ్యక్తం చేశారు. రెక్కలు ముక్కలు చేసుకుని దాచుకున్న సొమ్ము పోవడంతో తాము రోడ్డున పడ్డామని కన్నీటి పర్యంతమయ్యారు. వ్యాపారి నుంచి సొమ్మును రికవరీ చేసి, తమకు న్యాయం చేయాలని బాధితులు పోలీస్ అధికారులను వేడుకున్నారు. విషయం తెలుసుకొని ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు బాధితులకు సర్దిచెప్పి అక్కడి నుంచి పంపించేశారు.
రైతుల నుంచి డబ్బులు తీసుకుని ఐపీ
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



