Wednesday, June 3, 2026
E-PAPER
Homeరాష్ట్రీయం20 నుంచి వ్యకాస రాష్ట్ర నాల్గో మహాసభ

20 నుంచి వ్యకాస రాష్ట్ర నాల్గో మహాసభ

- Advertisement -


వేదికవుతున్న మహబూబ్‌నగర్‌
వాల్‌ పోస్టర్లను ఆవిష్కరించిన సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ
20న బహిరంగ సభ.. పాల్గొననున్న మాణిక్‌సర్కార్‌
నవతెలంగాణ -మహబూబ్‌ నగర్‌ ప్రాంతీయ ప్రతిని
ధి
ఈనెల 20, 21, 22 తేదీల్లో జరగనున్న తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర 4వ మహాసభను జయప్రదం చేయాలని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ పిలుపునిచ్చారు. మహబూబ్‌నగర్‌ జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో మంగళవారం జరిగిన రాష్ట్ర మహాసభ ఆహ్వాన సంఘం సమావేశంలో జాన్‌వెస్లీ పాల్గొన్నారు. వాల్‌ పోస్టర్లను ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. మహాసభకు రాష్ట్ర నలుమూలల నుంచి 1000 మంది ప్రతినిధులు హాజరవుతారని తెలిపారు. ఈ నెల 20న జరిగే బహిరంగ సభకు త్రిపుర మాజీ ముఖ్యమంత్రి మాణిక్‌సర్కార్‌ హాజరవు తున్నట్టు చెప్పారు. ఉపాధి హామీ చట్టాన్ని కేంద్ర ప్రభుత్వం పూర్తిగా నిర్వీర్యం చేసే ప్రయత్నం చేస్తోందన్నారు. 15 సంవత్సరాల కిందటే మాణిక్‌ సర్కారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఢిల్లీ నడిబొడ్డున జంతర్‌ మంతర్‌ దగ్గర ఉపాధి రక్షణ కోసం ధర్నా చేశారని గుర్తు చేశారు.
జిల్లాలో ఉన్న ఉపాధి హామీ కూలీలు, కార్మికులు, కర్షకులు, వ్యవసాయ కార్మికులందరూ పెద్దఎత్తున బహిరంగ సభకు హాజరై జయప్రదం చేయాలని కోరారు. బీజేపీ ప్రభుత్వం కూలీల మధ్య కూడా చిచ్చు పెడుతోందని విమర్శించారు. కూలీలకు సరైన వేతనం ఇవ్వాలని, ఫీల్డ్‌ అసిస్టెంట్లను పర్మినెంట్‌ చేయాలని, వారి వేతనం రూ.26 వేలకు పెంచాలన్న తదితర డిమాండ్లపై మహాసభలో చర్చించనున్నట్టు చెప్పారు. ఈ సమావేశంలో వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్‌.వెంకట్రాములు, రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సాగర్‌, సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షులు భూపాల్‌, తెలంగాణ గిరిజన సంఘం రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు ధర్మానాయక్‌, శ్రీరామ్‌ నాయక్‌, రైతు సంఘం రాష్ట్ర నాయకులు ఏ.రాములు, సీఐటీయూ రాష్ట్ర నాయకులు కిల్లే గోపాల్‌, జిల్లా కార్యదర్శి నల్లవెల్లి కురుమూర్తి, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్ష కార్యదర్శులు జగన్‌, కడియాల మోహన్‌ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -