Wednesday, June 24, 2026
E-PAPER
Homeఅంతర్జాతీయంఇరాన్ యుద్ధానికి80 బిలియన్ డాలర్లు అవసరం

ఇరాన్ యుద్ధానికి80 బిలియన్ డాలర్లు అవసరం

- Advertisement -

సెనెటర్లను కోరిన పెంటగాన్
వాషింగ్టన్ : ఇరాన్‌పై చేసిన యుద్ధానికి తనకు 80 బిలియన్ డాలర్లు అవసరమవుతాయని అమెరికా రక్షణ శాఖ కార్యాలయం సెనెటర్లను కోరింది. రక్షణ వ్యయాన్ని భారీగా పెంచాలని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇప్పటికే అభ్యర్థించారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో జరిపిన కేటాయింపులకు యాభై శాతం అదనంగా…అంటే ఒకటిన్నర ట్రిలియన్ డాలర్లు ఇవ్వాలని అధ్యక్షభవనం సైతం కోరింది. అయితే నిర్వహణ-బడ్జెట్‌కు సంబంధించిన అధ్యక్షభవనం కార్యాలయం దీనిపై ప్రతినిధిసభకు ఇప్పటి వరకూ ఎలాంటి అభ్యర్థన పంపలేదు. కానీ రక్షణ మంత్రి పీట్ హెగ్‌సేథ్ సోమవారం సాయంత్రం చట్టసభల సభ్యులతో సమావేశ మయ్యారు. ట్రంప్ ప్రభుత్వం నుంచి అనుబంధ వ్యయ అభ్యర్థన కోసం ఎదురు చూస్తున్నామని, అది అందిన తర్వాత దానిని పరిశీలిస్తామని సెనెట్ మెజారిటీ నాయకుడు జాన్ థూన్ చెప్పారు. ఇరాన్‌పై యుద్ధం చేయడాన్ని పలువురు చట్టసభల సభ్యులు వ్యతిరేకిస్తున్న నేపథ్యంలో అదనపు నిధుల కోసం వచ్చిన అభ్యర్థనలను వారు తోసిపుచ్చే అవకాశం ఉంది. జీవన వ్యయం పెరుగుతున్న సమయంలో పెంటగాన్‌కు మరిన్ని నిధులు ఇవ్వడం ఏమిటని వారు ప్రశ్నించారు. ‘మీరు పన్ను చెల్లింపుదారుల సొమ్మును యుద్ధం కోసం ఖర్చు చేస్తున్నారు. ఈ యుద్ధాన్ని అనేక మంది వ్యతిరేకిస్తున్నారు కదా’ అని గత నెలలో డెమొక్రటిక్ సెనెటర్ పాటీ ముర్రే విచారణ సందర్భంగా హెగ్‌సేథ్‌ను నిలదీశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -