Friday, May 29, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ప్రకృతి వైపరీత్యాన్ని రాజకీయం చేయడం విధానమా..!

ప్రకృతి వైపరీత్యాన్ని రాజకీయం చేయడం విధానమా..!

- Advertisement -

నవతెలంగాణ – బెజ్జంకి: వరి వేసిన రైతులను ఉరివేస్తామని నియంత పాలన సాగించిన బీఆర్ఎస్ ప్రభుత్వ హెచ్చరికలను రాష్ట్ర రైతాంగం మర్చిపోలేదని..ప్రకృతి వైపరీత్యాల వల్ల నత్తనడకన సాగుతున్న ధాన్యం కొనుగోల్లను రాజకీయం చేయడం మీ బీఆర్ఎస్ పార్టీ సంఘటితంగా తీసుకున్న విధానామా? లేక పార్టీకి సంబందం లేకుండా ప్రజల్లో కోల్పోయిన మళ్లీ తన ఉనికి కోసం మాజీ ఎమ్మెల్యే రసమయి ప్రత్యేకంగా తీసుకున్న విధానమా? ఎదిఎమైనా పదేళ్లు ఎమ్మెల్యేగా పని చేసిన మాజీ ఎమ్మెల్యే ప్రకృతి వైపరీత్యాలను రాజకీయం చేయడం అవిజ్ఞానమని కాంగ్రెస్ పార్టీ మండలాధ్యక్షుడు లింగాల శ్రీనివాస్ మాజీ ఎమ్మెల్యే రసమయిపై మండిపడ్డారు.

ఇటీవల ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ,మండల కాంగ్రెస్ శ్రేణులపై మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ చేసిన వాఖ్యలను శుక్రవారం మండల కేంద్రంలోని సత్యార్జునా గార్డెన్ యందు మండల కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో  తీవ్రంగా ఖండిచారు.ఈ సందర్భంగా మండలాధ్యక్షుడు శ్రీనివాస్ మాట్లాడారు. పదేళ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం,ఎమ్మెల్యేగా రసమయి వ్యవహరించిన తీరుకు నిదర్శనం రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వానికి,ఎమ్మెల్యేగా సత్యనారాయణను ప్రజలు ఎన్నుకుని అధికారం కట్టబెట్టారన్నారు.మండల కాంగ్రెస్ శ్రేణులను తొక్కితే కసరేల్లాలేని అహంకార పూరితత్వంతో మాజీ ఎమ్మెల్యే రసమయి చేసిన వాఖ్యలు.. అయనను నియోజకవర్గ  ప్రజలే తమ ఓట్లతో తొక్కితేనే నేడు ఈ దుస్థితి నెలకొందని గుర్తు చేశారు.

నేడు మండలంలోని గ్రామగ్రామానా ఇందిరమ్మ ఇండ్ల పండుగ జరుగుతోందని.. నియోజకవర్గ నిరుపేదల వైద్య చికిత్స కోసం సీఎంఆర్ఎఫ్,రైతులకు రుణమాఫీ,నిజమైన రైతులకు రైతు భరోసా ఆర్థిక సహాయం వంటివి అందజేస్తున్న ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానిది..ఎమ్మెల్యే సత్యనారాయణదన్నారు. మండలంలోని గూడెం గ్రామంలో మూడేకరాల భూ పంపిణిలో మీకు అనుగుణంగా ఉన్న లబ్దిదారులకు న్యాయం చేసి ఇతరులను ముప్పతిప్పలు పెట్టిన ఘనత రసమయిదేనని..అవినీతికి కేరాఫ్ గా రసమయి నిలిచారని ఆరోపించారు.స్థానికేతరుడైన రసమయిని నమ్మి పదేళ్లు ఎమ్మెల్యేగా మండల ప్రజలేన్నుకుంటే మండలాన్ని సిద్దిపేట జిల్లాలో కలిపి దోరల వద్ద బాంచన్ అంటూ ఆస్తులు కూడగట్టుకున్నది.

మండలంలో పైలెట్ ప్రాజెక్టుగా తీసుకున్న దళిత బందులో పైలెట్ ప్రాజెక్ట్ గ్రామానికి సంబందం లేని నీ అనుచరులకు దళిత బందు కట్టబెట్టింది నిజం కాదాని ప్రశ్నించారు.మీ పరిపాలనలో ఆకాల వర్షాలకు వరిధాన్యం నెలపాలయింది మర్చిపోయారంటూ గుర్తు చేశారు.మీ  ప్రభుత్వంలో నియమించిన లారీల గుత్తేదారు వల్లే రైతులు సమస్యలు ఎదుర్కొంటున్నారని వాపోయారు.ప్రజల్లో మీ ఉనికి కోసం యత్నించండని.. ప్రకృతి వైపరీత్యాల వల్ల సంభవించిన సమస్యలను రాజకీయం చేసి కాంగ్రెస్ ప్రభుత్వం..మండల కాంగ్రెస్ శ్రేణులపై బురదజల్లడం మానుకోవాలని కోరారు.ఈదురుగాలులు, ఆకాల వర్షాల వల్ల రైతాంగం తీవ్రంగా నష్టపోయారని. వారిని ఓదార్చి చేతనైతే సహాయం చేయాలని. ఎమ్మెల్యే, కాంగ్రెస్ శ్రేణులపై ఇష్టారీతిన వాఖ్యలు చేయడం సరైంది కాదని..మరోసారి ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ, మండల కాంగ్రెస్ శ్రేణులపై వాఖ్యలు చేస్తే నాలుక కోస్తామని మాజీ సర్పంచ్ రావుల నర్సయ్య మాజీ ఎమ్మెల్యే రసమయిని హెచ్చరించారు.పదేళ్లు ఎమ్మెల్యే పని చేసిన రసమయి బాలకిషన్ తన స్వార్థప్రయోజనాలకే పెద్దపీట వెసుకున్నారని ఆలయ అభివృద్ధి కమిటీ చైర్మన్ జెల్ల ప్రభాకర్ ఆరోపించారు. బ్రహ్మోత్సవాల్లో నిర్వహించిన దూం-దాం కార్యక్రమాలతో వ్యాపారులు నప్టపోయారన్నారు.

మండలంపై శ్రద్ద ఉంటే సిద్దిపేట మీదుగా సిరిసిల్ల వరకు వెళ్తున్న రైల్వే లైన్ ను బెజ్జంకి,ఇల్లంతకుంట మండలం మీదుగా మళ్లీంచలేదు ఎందుకని మాజీ ఎమ్మెల్యేను ప్రభాకర్ ప్రశ్నించారు.ఉన్నత చదువులు చదివిన మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ వాఖ్యలు చూస్తుంటే.. తిట్ల రసమయి అనుకోవడమే డాక్టరేట్ గా పరిగణించుకుంటామని.. ఇప్పటికైనా నియంత పోకడకు చరమగీతం పాడుకోవాలని రసమయిని జెల్లా ప్రభాకర్ కోరారు. ఈ సమావేశంలో మండల కాంగ్రెస్ శ్రేణులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -