Friday, May 29, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ లో విద్యార్థిని ప్రతిభ

గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ లో విద్యార్థిని ప్రతిభ

- Advertisement -

నవతెలంగాణ – పెబ్బేరు : కీబోర్డ్ పై స్వరాలు పలికించి గిన్నిస్ వరల్డ్ రికార్డుల్లో నలవాల అభివర్శిని తేజ ప్రతిభ చాటింది.  ఐదు నెలల పాటు ఆన్లైన్ కీబోర్డ్ ప్లేయింగ్ క్లాసులో శిక్షణ పొందిది.  పెబ్బేరు పట్టణానికి చెందిన సీనియర్ పాత్రికేయులు నలవాల విజయ్ రాణి దంపతులు చదువుతోపాటు వివిధ రంగాలలో రాణించాలని ఉద్దేశంతో అందించిన ప్రోత్సాహంతో ఈ ప్రతిభ చాటింది. ఫిబ్రవరి 2న హైదరాబాదులోని జురాస్టియన్ క్లబ్ లో గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ ఆధ్వర్యంలో సామూహిక కీ బోర్డు ప్లే కార్యక్రమం జరిగింది. సుమారు 22 దేశాల నుంచి 2000 మంది కీ బోర్డు వాయిద్య కారులు పాల్గొని గంట పాటు నిర్విరామంగా కీ బోర్డులో సరళ స్వరాలు ప్లే చేసి స్వరాగాలు పలికించడంతో 777 మంది ఎంపికయ్యారు. ఇందులో నలవాల అభివర్శిని తేజ చోటు దక్కించుకుంది. ఈరోజు హైదరాబాద్ గచ్చిబౌలి విక్టరీ ఆడిటోరియం లో ఏర్పాటుచేసిన అవార్డుల ప్రధానోస్తవ కార్యక్రమంలో హల్లెల్ మ్యూజిక్ స్కూల్ వ్యవస్థాపకులు అగస్తిన్ దండగి చేతుల మీదగా మెడల్స్ సర్టిఫికెట్ను పొందారు. అభి వర్షిని తేజ ప్రస్తుతం స్థానిక మాస్టర్ మైండ్స్ ఒలంపియాడ్ హై స్కూల్లో 9వ తరగతి చదువుతుంది. ఈ అవార్డును ఇటీవల అనారోగ్యంతో మృతి చెందిన వారి తాతయ్య కీ “శే” నలవాల కర్రెన్న కు అంకితం ఇస్తున్నట్టు తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -