మరో ప్రయోగానికి సిద్ధమవుతున్న ఇస్రో

శ్రీహరికోట : చంద్రయాన్‌-3 ప్రయోగాన్ని విజయవంతంగా చేపట్టిన భారత అంతరిక్ష పరిశధనా సంస్థ ఇస్రో ఇప్పుడు మరో ప్రయోగానికి సిద్ధమవుతున్నది. ఈ నెల 30వ తేదీ ఉదయం 6.30 గంటలకు పీఎస్‌ఎల్‌వీ-సీ56ను ప్రయోగించనున్నది. ఈ ప్రయోగం ద్వారా 422 కిలోల బరువు కలిగిన ఏడు సింగపూర్‌కు చెందిన ఉపగ్రహాలను ఇస్రో రోదసిలోకి ప్రయోగించనున్నది. ఇప్పటికే అన్ని దశలను అననుసంధానం చేసి పూర్తి స్థాయి రాకెట్‌ను మొబైల్‌ సర్వీస్‌ టవర్‌ వద్దకు తీసుకొచ్చారు. రాకెట్‌ శిఖర భాగాన ఏడు శాటిలైట్లను అమర్చి, హీట్‌ షీల్డ్స్‌ ను క్లోజ్‌ చేసే ప్రక్రియను పూర్తి చేశారు.

Spread the love