ఉక్రెయిన్‌ గోధుమల ఎగుమతులకు సబ్సిడీ ఇవ్వలేం

– చేెతులెత్తేసిన యురోపియన్‌ యూనియన్‌
బ్రస్సెల్స్‌ : ఉక్రెయిన్‌ గోధుమల ఎగుమతులకు సబ్సిడీ ఇవ్వడానికి యురోపియన్‌ కమిషన్‌ తిరస్కరించింది. తమ వద్ద అంత డబ్బు లేదని తెలిపింది. అయితే ఈ ఆలోచనను కొంతమంది ఇయు సభ్యులు వ్యతిరేకిస్తున్నారు. రష్యాపై యుద్ధం జరుపుతున్న ఉక్రెయిన్‌కు మద్దతుగా ఉక్రెయిన్‌ ఉత్పత్తులపై టారిఫ్‌లను, కోటాలను ఇయు గతేడాది తొలగించింది. ఉక్రెయిన్‌ గోధుమలను నల్ల సముద్రం గుండా తీసుకెళ్లే వాణిజ్యపరమైన నౌకలకు భద్రతాపరమైన హామీలివ్వడానికి గతేడాది జులైలో రష్యా అంగీకరించింది. కానీ ఈ నెల ప్రారంభంలో ఈ ఒప్పందం కుప్పకూలింది. తమ స్వంత ఆహార, ఎరువుల వాణిజ్యంపై ఆంక్షల విషయంలో రష్యాకు ముందుగా హామీ ఇచ్చిన రీతిలో ఉపశమనం లభించకపోవడంతో ఒప్పందం అమలును నిలుపుచేసినట్లు ప్రకటించింది.

Spread the love