నవతెలంగాణ- హైదరాబాద్: మాజీ ఎంపీ, కాంగ్రెస్ నేత వివేక్ ఇంట్లో ఐటీ, ఈడీ సోదాలు ఎన్నికల వేడిని మరింత పెంచాయి. హైదరాబాద్ తో పాటు వివేక్ పోటీ చేస్తున్న చెన్నూరులో సోదాలు జరిగియి. హైదరాబాద్ లోని నివాసంలో కాసేపటి క్రితం సోదాలు ముగిశాయి. దాదాపు నాలుగున్నర గంటల పాటు సోదాలు జరిగాయి. సోదాల సమయంలో వివేక్ ఇంట్లో ఎవరూ లేకపోవడంతో అధికారులు వెళ్లిపోయారు. సోదాల్లో ఎలాంటి డాక్యుమెంట్లు, నగదును సీజ్ చేయలేదని సమాచారం.