తగ్గిన బంగారం ధరలు..

నవతెలంగాణ – హైదరాబాద్ : మగువలకు గుడ్ న్యూస్..గడిచిన 2 రోజులుగా స్తిరంగా నమోదు అవుతూ వస్తున్న బంగారం ధరలు…ఇవాళ మాత్రం కాస్త తగ్గాయి. తాజాగా బంగారం ధరలు భారీగా తగ్గాయి. హైదరాబాద్ నగరంలో బంగారం ధరల వివరాల్లోకి వెళితే.. హైదరాబాద్ మార్కెట్‌ లో ఇవాళ 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 50 తగ్గి, రూ. 61, 640 గా నమోదు కాగా.. అదే స‌మ‌యం లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 50 తగ్గి, రూ. 56, 650 గా ప‌లుకుతుంది. ఇక వెండి ధ‌ర‌లు మాత్రం స్థిరంగా నమోదు అయ్యాయి. దీంతో కేజీ వెండి ధర రూ. 79, 000 గా నమోదు అయింది.

Spread the love