వారాంతపు సంత ఏర్పాటు చేయడం ఎంతో అభినందనీయం..

– సౌకర్యాలు కల్పిస్తాం..
– సర్పంచ్ పత్తి మమతా అనంద్..
నవతెలంగాణ- డిచ్ పల్లి
ఎన్నో ఏళ్లుగా గ్రామంలో వారాంతపు సంత లేకపోవడం తో గ్రామస్తులు కూరగాయలకు ఎన్నో వ్యాసా ప్రయాసలతో జిల్లా కేంద్రం,మండల కేంద్రం నాకు వేళ్ళవల్సిన అవసరం ఉండేదని పలుమార్లు గ్రామస్తులు వారాంతపు సంత విషయమై దృష్టి కి తేవడంతో ప్రతి ఆదివారం వారాంతపు సంత ఏర్పాటు చేసినట్లు సర్పంచ్ పత్తి మమతా అనంద్ హర్షం వ్యక్తం చేస్తు తెలిపారు.ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ గ్రామ అభివృద్ది కమిటీ తో వారాంతపు సంత విషయమై కూరగాయల మార్కెట్ గ్రామంలో నెలకొల్పితే గ్రామస్థులకు ఎన్నో రకాలుగా ఇబ్బందులు తప్పుతాయని వివరించారు దీంతో సర్పంచ్ పత్తి మమత ఆనంద్ ఆధ్వర్యంలో విడీసి సభ్యుల అంగీకారించి ఇరువురి చొరవతో వారంతపు సంతను గ్రామ శివారులోని నిజాంసాగర్   కెనాల్ కట్ట క్రీడ ప్రాంగణం వద్ద వారాంతపు సంత చేయాలని తీర్మాణం చేసి ఏర్పాట్లు చేశారు. రావో రోజుల్లో వారంతపు సంతకు వచ్చే వ్యాపారస్తులకు ప్రజలకు ఇబ్బందులు కలగకుండా సౌకర్యాలు కల్పనకు పాలకవర్గం గ్రామాభివృద్ధి కమిటీతో కలిసి కృషి చేస్తానని సర్పంచ్ పత్తి మమత ఆనంద్ అన్నారు. గ్రామస్తులు చుట్టుపక్కల ఉన్న గ్రామాల ప్రజలు ఈ సంతను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.ఈ కార్యక్రమంలో బర్దిపూర్ సహకార  సొసైటీ చైర్మన్ కొసరాజు రామకృష్ణ, నరసింహరావు, గ్రామ అభివృద్ధి కమిటీ చైర్మన్ తలారి సాయన్న, ప్రధాన కార్యదర్శి గోరంట్ల రాజేష్, క్యాషియర్ గొల్లపల్లి సత్యనారాయణ, వైస్ చైర్మన్ సర్వరాజు, సభ్యులు బాలగంగాధర్, నారాయణ, సాయిలు, గంగాధర్ గౌడ్, కోటగిరి రాజు, భాస్కర్, సుధాకర్ ,తో పాటు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.
Spread the love