Saturday, June 6, 2026
E-PAPER
Homeజాతీయంసీబీఎస్ఈది బాధ్యతారాహిత్యం

సీబీఎస్ఈది బాధ్యతారాహిత్యం

- Advertisement -

రాజ్యసభ ఎంపీ జాన్ బ్రిట్టాస్
12వ తరగతి పరీక్ష‍ా ఫలితాల వివాదంపై విమర్శ

​న్యూఢిల్లీ: 12వ తరగతి పరీక్షల ఫలితాల వివాదంపై సీబీఎస్‌ఈ తన బాధ్యతను పూర్తిగా వదిలేయడాన్ని రాజ్యసభ ఎంపీ డాక్టర్ జాన్ బ్రిట్టాస్ ఖండించారు. లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తు పట్ల బోర్డు, కేంద్ర ప్రభుత్వం మరోసారి తమ పూర్తి నిర్లక్ష్యాన్ని ప్రదర్శించాయని అన్నారు. ఆన్-స్క్రీన్ మార్కింగ్ విధానంలో అవకతవకలు, మూల్యాంకనంలో వైరుధ్యాలు, అస్పష్టంగా ఉన్న జవాబు పత్రాలు, పునఃమూల్యాంకన పోర్టల్‌లో సాంకేతిక వైఫల్యాలు వంటి విద్యార్థులు లేవనెత్తిన తీవ్రమైన ఆందోళనలను ప్రస్తావిస్తూ తాను కేంద్ర విద్యాశాఖ మంత్రికి రెండు సవివరమైన లేఖలు రాశానని బ్రిట్టాస్ తెలిపారు. ఇవన్నీ విద్యార్థుల ఉన్నత విద్యావకాశాలు, వృత్తి మార్గాలపై నేరుగా ప్రభావం చూపుతాయని ఆయన పేర్కొన్నారు. సీబీఎస్‌ఈ అధికారిక స్పందన, దాని ఉదాసీనత ఆశ్చర్యపరిచిందని జాన్‌‌బ్రిట్టాస్‌ అన్నారు. బోర్డు సమాధానంలో.. “మీ ఆందోళనలను పంచుకున్నందుకు ధన్యవాదాలు. భవిష్యత్ పరిశీలన కోసం మీ సూచనలు/ఆందోళనలు నమోదు చేయబడ్డాయి.” అని ఉండగా ఇవి భవిష్యత్తులో పరిగణించాల్సిన విషయాలు కావని, ఈ విద్యా సంవత్సరంలోనే విద్యార్థుల కలలు, ప్రవేశాలు, కెరీర్‌లు ప్రమాదంలో పడిన సమస్యలని బ్రిట్టాస్ పేర్కొన్నారు. “లక్షలాది మంది విద్యార్థుల తరపున లేఖ రాసినప్పుడు ఒక పార్లమెంట్ సభ్యుడికే ఇలాంటి అధికారిక స్పందన వస్తే, విద్యార్థులు, తల్లిదండ్రులు నేరుగా దాఖలు చేసిన ఫిర్యాదులను బోర్డు ఎలా పరిగణిస్తుందో ఊహించవచ్చు” అని ఆయన అన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -