ఆర్పీలకు సర్వే డబ్బులు చెల్లించినట్లు చెప్పడం సరికాదు 

It is not correct to say that survey money was paid to RPs మెప్మా ఆర్పి జిల్లా అధ్యక్షురాలు రాష్ట్ర ఉపాధ్యక్షులు స్వర్ణలత

నవతెలంగాణ – కంఠేశ్వర్ 
ఆర్పీలకు సర్వే డబ్బులు చెల్లించినట్లు సంబంధిత శాఖ అధికారులు సిబ్బంది తెలపడం సరైనది కాదని మెప్మా ఆర్పి జిల్లా అధ్యక్షురాలు రాష్ట్ర ఉపాధ్యక్షులు స్వర్ణలత ఆదివారం ఖండించారు. సర్వే డబ్బులు ఇవ్వకుండా ఇచ్చినట్లు ప్రకటించడం సరైన పద్ధతి కాదన్నారు. ప్రభుత్వం నిర్వహిస్తున్న సమగ్ర కుటుంబ సర్వేకు ఆర్పీ లు సుముఖంగా ఉన్నప్పటికీ, అధికారుల నుండి సరైన సమాధానం రాకపోవడంతో ఆర్పీ లు సర్వే నుండి దూరంగా ఉన్నట్లు తెలిపారు. ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్న ప్రభుత్వం అమలు పరిచే పథకాలను ప్రజలకు వివరించడంలో ఆర్పీలు ప్రత్యేక పాత్ర పోషిస్తున్నారని పేర్కొన్నారు. ఇంత వరకు సుమారు 50 రకాల సర్వేలు నిర్వహించిన , తమకు హనారోరియం చెల్లించడంలో అధికారులు వైఫల్యం చేశారన్నారన్నారు. చాలి చాలని వేతనాలతో జీవనం వెళ్లదీస్తున్న సర్వే డబ్బులు చెల్లించడం లేదన్నారు. ఆర్పీ లకు సర్వే డబ్బులు చెల్లించినట్లు చెప్పడం సరికాదన్నారు. సమగ్ర కుటుంబ సర్వే డబ్బులు ఇతర ప్రాంతంలో 10 వేలు ఇస్తామని అధికారులు చెప్పిన, నిజామాబాద్ లో ఏ ఒక్క అధికారి తమకు చెప్పినట్లు దాఖలాలు లేవన్నారు. టిఎంసి అసత్యపు మాటలతో అధికారులను తప్పుబట్టిస్తున్నారాన్నారు. ఉన్నతాధికారులు ఈ విషయాన్ని గ్రహించాలని కోరారు.
Spread the love