అవసరం కోసం అమ్మారు.. వారసులొచ్చి అమ్మలేదంటున్నారు 

They sold it for necessityనవతెలంగాణ –  కామారెడ్డి 
వీరాంజనేయ గుడి వద్ద గల స్థలాన్ని సర్వే నెంబర్, 178/4,  లో గల నాలుగు ఎకరాల 9 వ్యవసాయం భూమిని  గతంలోనే ఈ స్థల యజమాని అయినటువంటి మిద్దె నరసవ్వ 1998 అక్టోబర్ నెలలో చుక్కాపూర్ గ్రామానికి చెందిన చాకలి శివరాజయ్యకు నాలుగు ఎకరాల 9 భూమిని విక్రయించడం జరిగింది. ఆ భూమి రిజిస్ట్రేషన్ సైతం జరిగిందని బాధితులు ఆరోపిస్తున్నారు. గత మూడు సంవత్సరాల నుండి ఆమె వారసులైనటువంటి మనోజ్ గౌడ్, నవీన్ గౌడ్, ఎల్లా గౌడ్, దిలీప్ గౌడ్, శంకర్ గౌడ్, జితేందర్ గౌడ్, నితిన్ గౌడ్లు ఆ స్థలంలోకి చొరబడి దౌర్జన్యం చేస్తూ తమను బెదిరిస్తూ నీకు అమ్మిన వారిని తోలక రమ్మని అంటూ హద్దులను తొలగిస్తున్నారని  సాకలి శివరాజయ్య కుమారుడు ఆంజనేయులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇట్టి భూమి విషయం కోర్టు వివాదాల్లో ఉందని అప్పటినుండి ఆ భూమి వద్దకు మేము వెళ్ళడం లేదని గత కొన్ని రోజుల నుండి వీరు తమను భయభ్రాంతులకు గురి చేస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. సాకలి శివరాజయ్య కుటుంబీకులు వీరాంజనేయ గుడి కోసం రెండు గుంటల భూమిని విరాళంగా ఇచ్చామన్నారు. అధికారులు తమకు న్యాయం చేయాలని ఈ సందర్భంగా కోరుతున్నారు.
Spread the love