Saturday, June 20, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంకమల కళ్యాణాలొచ్చినా మాకేం నష్టం లేదు

కమల కళ్యాణాలొచ్చినా మాకేం నష్టం లేదు

- Advertisement -

రాష్ట్రంలో కాంగ్రెస్‌‌కు ఢోకాలేదు
ఆర్‌ఎస్‌ఎస్‌ వ్యక్తుల వల్లే నీట్‌ లీకేజీ : పీసీసీ చీఫ్‌ మహేశ్‌‌కుమార్‌ గౌడ్‌

నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
కమల కల్యాణా(పవన్‌ ‌కళ్యాణ్‌) లు వచ్చిన ‌తమకేం నష్టం లేదని పీసీసీ అధ్యక్ష‍ులు మహేశ్‌‌కుమార్‌ ‌గౌడ్‌ అన్నారు. శుక్రవారం హైదరాబాద్‌‌లోని గాంధీ భవన్‌‌లో ఆయన విలేకర్లతో మాట్లాడారు. రాష్ట్రంలో కాంగ్రెస్‌‌కు ఢోకా లేదన్నారు. ఆర్ఎస్ఎస్ భావజాల వ్యక్తులు యూనివర్సిటీ లో దూరడం వల్ల విద్యావిధానం గతి తప్పిందని ఆందోళన వ్యక్తం చేశారు. 22 లక్షల మంది విద్యార్థులు రేయింబవళ్ళు చదివి పరీక్షలు రాస్తే.. ప్రభుత్వం వైఫల్యం వల్ల విద్యార్థుల కష్టం బూడిద పాలైందని తెలిపారు. పరీక్షల నిర్వహణలో పారదర్శకత రావాలనీ, విద్యా వ్యవస్థలో సవరణలు జరగాలని డిమాండ్‌ ‌చేశారు. యువత భావజాలం అర్ధం చేసుకునే రాహుల్ గాంధీ పోరాటం చేస్తున్నారని గుర్తు చేశారు. లౌకిక వాదం పై నమ్మకమున్నన్న ప్రతి ఒక్కరి తరపున రాహుల్‌‌కు ఈ సందర్భంగా జన్మదిన శుభాకాంక్ష లు తెలిపారు. ప్రధాని మోడీకి తాను చదువుకున్న డిగ్రీపైన్నేస్పష్టత లేదని చెప్పారు. ఆయన ప్రభుత్వ సంస్థలను కార్పొరేట్లకు కట్టబెడుతున్నా రని ఆవేదన వ్యక్తం చేశారు. ఉద్యోగ అవకాశాలు లేక యువత ఆందోళనలో ఉందని చెప్పారు. యువత మనోవేదనకు కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. యువత భవితే దేశానికి భవిష్యత్ అని స్పష్టం చేశారు. విలేకర్ల సమావేశంలో మీడియా కమిటీ చైర్మెన్‌ ‌సామ రామ్మోహన్ రెడ్డి , ఉపాధ్యక్షులు సంగిశెట్టి జగదీష్ , ప్రధాన కార్యదర్శి అల్లం భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -