జవహర్ నవోదయ 9,11 వ తరగతికి ప్రవేశ పరీక్ష గడువు పెంపు

నవతెలంగాణ -పెద్దవూర
నల్గొండ జిల్లా నాగార్జున సాగర్ నియోజకవర్గం పెద్దవూర మండలం చలకుర్తి క్యాంపు లో ఉన్న జవహర్ నవోదయ విద్యాలయంలో 2024 -2025 విద్యా సంవత్సరంగాను 9వ, తరగతి మరియు ఇంటర్ ప్రధమ సవత్సరం తరగతులకు గాను ఖాళీగా ఉన్న పరిమిత సీట్ల ప్రవేశానికి గాను అర్హులైన అభ్యర్థుల నుంచి ఆన్‌లైన్ లో దరఖాస్తు చేసుకొనుటకు నవంబర్ 15 వతేదీవరకు దరఖాస్తు గడువును పొడగించి నట్లు ప్రిన్సిపాల్ ఆర్. నాగభూషణం మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు.ప్రవేశ ప్రవేశ పరీక్షకు హాజర్యయ్యే అభ్యర్థులు ప్రస్తుత విద్యా సంవత్సరంలో 8వ తరగతి చదువుతూ 01.05.2009 నుంచి 31.07.2011 తేదీల మధ్య జన్మించి ఉండాలని, ఇంటర్మీడియట్ ప్రవేశం కోరే విద్యార్థులు ప్రస్తుత విద్యా సంవత్సరంలో పదవ తరగతి ఉమ్మడి నల్గొండ జిల్లాలో చదువుతూ 01.06.2007 నుంచి 31.07.2009 తేదీల మధ్యలో జన్మించి ఉండాలని తెలిపారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలోని ఏదేని ప్రభుత్వ లేదా గుర్తింపు పొందిన ప్రైవేట్ పాఠశాలల్లో చదువుతున్న బాలబాలికలు ఉచితంగా  15 తేదీ లోగా దరఖాస్తు చేసుకోవాలనికోరారు.కాగా ఇప్పటికే దరఖాస్తు చేసుకున్న విద్యార్థులు కేటగిరి (జనరల్ /ఓబీసీ /ఎస్టీ /ఎస్సి )ఏరియా (గ్రామీణ /అర్బన్ /వైఖల్యం ), మీడియం ఆఫ్ ఎగ్జామినేషన్ వివరాలతో సవరణలు చేసుకోవడానికి ఈ నెల 16,17, తేదీలలో https:/navodaya.gov.in వెబ్ సైట్ లో సరి చేసుకోవాలని, ఈ అవకాశన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.అలాగే వారి తల్లిదండ్రుల నివాసం ఉమ్మడి జిల్లాలోనిదై ఉండాలని, రెండు తరగతుల ప్రవేశ పరీక్ష పీబ్రవరి 10 -2024 న నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు. విద్యార్థులు ఈ అవకాశన్ని సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు.
Spread the love