15 ఆగస్టు తర్వాత రెండు లక్షల లోపు రుణమాఫీ అందజేస్తాం: జీవన్ రెడ్డి

నవతెలంగాణ – రెంజల్ 

కాంగ్రెస్ ప్రభుత్వం బడుగు బలహీనవర్గాల అభివృద్ధి కై విశేషంగా కృషి చేస్తుందని, 15 ఆగస్టు లోపు రెండు లక్షల రుణమాఫీ ఇవ్వనున్నట్లు నిజామాబాద్ పార్లమెంట్ అభ్యర్థి జీవన్ రెడ్డి స్పష్టం చేశారు. సోమవారం రాత్రి రెంజల్ మండలం సాటాపూర్ చౌరస్తాలో ఏర్పాటుచేసిన కార్నర్ సమావేశంలో ఆయన ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఆరు గ్యారెంటీ పథకాలను ఇస్తామని చేసిన హామీలలో ఇప్పటికే నాలుగు హామీలను పూర్తి చేయడం జరిగిందన్నారు. నిజామాబాద్ ప్రజలకు త్వరలోనే తీపి కబుర్లు అందిస్తామని, నిజం షవర్ ఫ్యాక్టరీ కార్మికులకు సుమారుగా రూ.43 కోట్ల రూపాయల బకాయిలను అందించడమే కాకుండా ఫ్యాక్టరీ పునరుద్ధరణకు సమయతమవుతున్నది వారు పేర్కొన్నారు. కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే రెండువేల రూపాయలు పింఛన్ రూ.4000 రూపాయలకు పెంచనున్నట్లు ఆయన స్పష్టం చేశారు. బోధన్ నియోజకవర్గం లోని ప్రజలకు సాగునీటి అందించాలన్న తలంపుతో అల్లి సాగర ఎత్తిపోతల పథకం, కందకుర్తి ఎత్తిపోతల పథకాల ద్వారా తాగునీటి అందించిన ఘనత కాంగ్రెస్కి దక్కిందన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు మోబీన్ ఖాన్, ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహర్ బిన్ అందాన్, స్థానిక నాయకులు ధనుంజయ్, సురేందర్ గౌడ్, జావీద్, గయా సుదీన్, జి సాయి రెడ్డి, సిహెచ్ రాములు, గంగా కృష్ణ, చీరడు రవి, ఉ బేద్, కాజా మాజీ సర్పంచులు సాయి రెడ్డి, ఎంఎస్ రమేష్ కుమార్, సోషల్ మీడియా ఏంజెల్ మండల ఇంచార్జ్ సల్మాన్ ఖాన్, యువజన నాయకులు మహిళలు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
Spread the love