న్యూఢిల్లీ : ఈ నెల 24న సెంట్రల్ ట్రేడ్ యూనియన్‌ల, ఫెడరేషన్‌ల ఉమ్మడి వేదిక, సంయుక్త కిసాన్ మోర్చా (ఎస్‌కేఎం) తల్కతోరా స్టేడియంలో చారిత్రాత్మక అఖిల భారత సదస్సు నిర్వహించనున్నాయి. పెరుగుతున్న దాడుల కు వ్యతిరేకంగా, మోడీ ప్రభుత్వం హక్కుల హననాన్ని నిరసిస్తూ కార్మికులు, రైతుల ఐక్య పోరాటానికి సంస్థాగత రూపం ఇవ్వడానికి ఈ సదస్సు నిర్వహిస్తు న్నారు. సీఐటీయూ, ఏఐటీయూసీ, ఐఎన్టీయూసీ, హెచ్‌ఎంఎస్, ఎల్పీఎఫ్, ఏఐ యూటీయూసీ, టీయూసీసీ, ఎస్పీడబ్ల్యూఏ, ఏఐసీసీటీయూ, యూటీయూసీ పది కేంద్ర కార్మిక సంఘాల ఉమ్మడి వేదిక 2014లో మోడీ వచ్చినప్పటి నుంచి కార్మికుల తరపున దేశవ్యాప్తంగా కార్మికుల ఐక్య పోరాటానికి నాయకత్వం వహిం చింది. కార్మికులు, రైతుల సంఘాలు సంయుక్తంగా ఆగస్టు 24 అఖిల భారత సదస్సు నిర్వహించి, దేశంలోని అత్యధిక సంఖ్యలో శ్రమిస్తున్న వర్గాలకు ప్రాతి నిధ్యం వహిస్తున్న ఈ రెండు వేదికలు ఏకతాటిపైకి తీసుకువస్తుంది. తన కార్పొరేట్ అధికారాన్ని నిలబెట్టుకోవాలనే ఉద్దేశంతో ప్రభుత్వం అనుసరిస్తున్న కార్పొరేట్ అనుకూల, రైతు వ్యతిరేక, కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ ఐక్య కార్యాచరణ ప్రణాళికను రూపొందిస్తుంది. దేశంలోని అన్ని ప్రాంతాలలో ద్వేషం, సంఘర్షణను రెచ్చగొట్టడంతో మతపరమైన అనుబంధాన్ని ఈ సదస్సు చర్చిస్తుంది. ఈ విధానాలకు వ్యతిరేకంగా దేశవ్యాప్త ప్రచారం, పోరాట కార్యక్రమాన్ని నిర్ణయిస్తుంది.