తెలంగాణ ఏర్పాటు కావాలని మొదటిగా కోరిన వ్యక్తి కాళోజి

Kaloji was the first person who demanded the formation of Telanganaనవతెలంగాణ –  కామారెడ్డి
నారాయణరావు 1964 తెలంగాణ ఉద్యమంలో పాల్గొని తెలంగాణ ఏర్పాటు కావాలని మొదటిగా కోరిన వ్యక్తి కాళోజి నారాయణరావు అని రోటరీ క్లబ్ ఆఫ్ కామారెడ్డి అధ్యక్షులు పీ, నరసింహారెడ్డి అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. శ్రీ కాళోజి నారాయణరావు  జన్మదిన సందర్భంగా తెలంగాణ తెలుగు భాషా దినోత్సవాన్ని కామారెడ్డి జిల్లా కేంద్రంలోని జడ్పి,హెచ్,ఎస్ , గంజి పాఠశాలలో కామారెడ్డి  రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో తెలుగు భాషా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించడం జరిగిందన్నారు.  తెలుగు భాషకు ఎల్లలేని సేవ చేశారని, సామాజిక సమస్యలపై, తెలుగు భాష ఉన్నతి, తెలుగు భాష యాస ప్రాస కు కృషి చేశారని ఈ సందర్భంగా పాఠశాల విద్యార్థులకు  తెలుగు భాషాపైన ఉపన్యాసాలు, వ్యాసరచన, కార్యక్రమాలు నిర్వహించడం జరిగిందన్నారు. వ్యాసరచన ఉపన్యాస పోటీల్లో గెలుపొందిన వారికి బహుమతులను అందజేశారు. ఈ కార్యక్రమంలో క్లబ్ కోశాధికారి కృష్ణ హరి, తెలుగు భాష ఉపాధ్యాయులు రాజేందర్, శైలజ  ఉపాధ్యాయిని ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
Spread the love