కమలన్నీ వీడి కారెక్కిన కౌన్సిలర్..

– గడ్డమీది లావణ్య-శ్రీనివాస్..
– కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన చల్మెడ
నవతెలంగాణ – వేములవాడ
ఎన్నికలు సమీపిస్తున్న వేళా వేములవాడలో భారతీయ జనతా పార్టీకి దెబ్బమీద దెబ్బ తగులుతుంది. మంగళవారం బీజేపీ కౌన్సిలర్, మున్సిపల్ ఫ్లోర్ లీడర్ ముప్పిడి సునంద-శ్రీనివాస్ పార్టీని వీడి బి.ఆర్.ఎస్ పార్టీ లో చేరగా, బుధవారం వేములవాడ మున్సిపల్ విలీన గ్రామమైన కోనాయపల్లి 13వ వార్డ్ బీజేపీ కౌన్సిలర్ గడ్డమీది లావణ్య-శ్రీనివాస్ బి.ఆర్.ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి చల్మెడ లక్ష్మీ నరసింహా రావు సమక్షంలో బి.ఆర్.ఎస్ పార్టీలో చేరారు. కోనాయపల్లిలోని కౌన్సిలర్ నివాసంలో ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో  మాజీ సర్పంచ్ దుర్ముట్ల వెంకట్ రెడ్డి ఆధ్వర్యంలో పార్టీలో చేరిన వీరికి లక్ష్మీ నరసింహా రావు కండువా కప్పి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ ముప్పిడి సునంద-శ్రీనివాస్, సీనియర్ నాయకుడు ఏనుగు మనోహర్ రెడ్డి, గజానంద రావు, ఆర్.సి రావు,రామతీర్థపు రాజు, రాజేశం, గోపు బాలరాజు, ఈర్లపల్లి రాజు తదితరులు పాల్గొన్నారు.
గులాబీ పార్టీలో భారీ చేరికలు
పార్టీలో చేరిన 100మంది రుద్రవరం మహిళలు, యువకులు
వేములవాడ అర్బన్ మండలం రుద్రవరం ఆర్ అండ్ ఆర్ కాలనీకి చెందిన మహిళలు, యువకులు సుమారు 100మంది బుధవారం బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి చల్మెడ లక్ష్మీ నరసింహా రావు సమక్షంలో బి.ఆర్.ఎస్ పార్టీలో చేరారు. బుధవారం వేములవాడ పట్టణంలోని చల్మెడ నివాసంలో ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో పొన్నాల రాజు ఆధ్వర్యంలో పార్టీలో చేరిన వీరికి లక్ష్మీ నరసింహా రావు కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో. కౌన్సిలర్ ముప్పిడి సునంద-శ్రీనివాస్, సీనియర్ నాయకుడు ఏనుగు మనోహర్ రెడ్డి, గజానంద రావు, ఆర్.సి రావు,రామతీర్థపు రాజు, రాజేశం, గోపు బాలరాజు, ఈర్లపల్లి రాజు సర్పంచ్ ఊరడి రామ్ రెడ్డి, సెస్ డైరెక్టర్ హరి చరణ్ రావు, నాయకులు మెడికల్ రాజిరెడ్డి, కాసర్ల అరుణ్, తాడేం లచ్చయ్య, కూతురు బక్కయ్య, గోనె నాగరాజు, గుండెల్లి సాయి, విశాల్, నవీన్, అజయ్ తదితరులు పాల్గొన్నారు.
Spread the love