ఘనంగా కార్తీక పౌర్ణమి ఉత్సవాలు

నవతెలంగాణ- తాడ్వాయి 
మండలం బ్రహ్మాజీ వాడి శివారులోని సిద్దులగుట్ట ఆవరణలో ఆదివారం కార్తీక పౌర్ణమి సందర్భంగా ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా సిద్దేశ్వర స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ ఉత్సవాలకు తాడువాయి మండలంలోని భక్తులే కాకుండా చుట్టుపక్కల మండలాలైన లింగంపేట, నాగిరెడ్డిపేట, కామారెడ్డి, గాంధారి, భిక్కనూరు మండలాల నుంచి భక్తులు తరలివచ్చి పూజలు నిర్వహించారు ఈ ఉత్సవాలకు ప్రత్యేక అతిథిగా ఎల్లారెడ్డి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి మదన్మోహన్ హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు ఆలయ అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని తెలిపారు ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు
Spread the love