Sunday, August 9, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంనేడు నర్సంపేటకు కేసీఆర్

నేడు నర్సంపేటకు కేసీఆర్

- Advertisement -

పెద్ది కుటుంబాన్ని పరామర్శించనున్న బీఆర్‌ఎస్‌ అధినేత
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
ఇటీవల అనారోగ్యంతో మృతి చెందిన బీఆర్‌ఎస్‌ ‌పార్టీ సీనియర్‌ నాయకులు పెద్ది సుదర్శన్‌‌రెడ్డి కుటుంబాన్ని ఆ పార్టీ అధినేత కేసీఆర్‌ ‌నేడు పరామర్శించనున్నారు. ఆదివారం ఉదయం ఎర్రబెల్లి ఫాం హౌస్‌ ‌నుంచి ‌బయలుదేరి నర్సంపేట నియోజకవర్గం లోని పెద్ది స్వగ్రామమైన నల్లబెల్లికి వెళ్ళనున్నారు. బీఆర్‌ఎస్‌ పార్టీ స్థాపించిన నాటి నుంచి నిబద్ధతతో పనిచేస్తూ, తెలంగాణ కోసం జరిగిన ఉద్యమంలో ముందుండి పోరాడారు. తన ముఖ్య అనుచరుడుగా కొనసాగిన సుదర్శన్ రెడ్డి కుటుంబ సభ్యులను పరామర్శించి, కష్టకాలంలో ఉన్న వారికి భరోసా ఇవ్వనున్నారు. పెద్ది కుటుంబానికి ఇప్పటికే రూ.2. 25 కోట్ల ఆర్థిక సహాయం ప్రకటించిన విషయం తెలిసిందే.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -