Sunday, May 31, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్పరిసరాల పరిశుభ్రత మనందరి బాధ్యత....

పరిసరాల పరిశుభ్రత మనందరి బాధ్యత….

- Advertisement -

నవతెలంగాణ – ఆర్మూర్ : పరిసరాల పరిశుభ్రత మనందరి బాధ్యత అని దీనికోసం ప్రతి ఒక్కరు తమవంతు కృషి చేయాలని  మహాత్మ స్వచ్చంద సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు సుంకె శ్రీనివాస్ అన్నారు.  పట్టణంలోని జర్నలిస్టు కాలనిలో గల ప్రకృతి వనంలో ఆదివారం స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పరిసరాలను శుభ్రంగా ఉంచుకొనేందుకు ప్రతి ఒక్కరు తమ వంతు సహకారం అందిచాలన్నారు. ఇందులో భాగంగానే ప్రతి ఆదివారం ఒక గంట నినాదంతో ఈ స్వచ్ఛ కార్యక్రమాన్ని 56 వారాలుగా నిర్వహిస్తున్నామన్నారు. ప్రకృతి వనంలో పెరిగిన పిచ్చిమొక్కలు, చెత్తను తొలగించామన్నారు. ఈ స్వచ్ఛ కార్యక్రమంలో కాలని వాసులు ఉత్సాహంగా పాల్గొన్నారన్నారు. ఈ కార్యక్రమంలో స్వచ్ఛంద సంస్థ సభ్యులు సుంకె నిశాంత్, బట్టు సుమన్, జంగిడి భోజన్న, జహీర్, గణేష్, శ్యాంసుందర్, డ్రైవింగ్ స్కూల్ వేణు, యాదగిరి, రాహుల్ రాజ్, సంతోష్, రఘువరన్, సాయి తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -