ఫ్రీ బస్‌పై మోడీ విమర్శలకు కేజ్రీవాల్ కౌంటర్.!

నవతెలంగాణ – ఢిల్లీ: మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ హామీతో మెట్రోను ఇబ్బందుల్లో పడేస్తున్నారన్న ప్రధాని మోడీ చేసిన వ్యాఖ్యలపై ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కౌంటర్ ఇచ్చారు. ‘ఢిల్లీలో అమలవుతున్న ఈ స్కీమ్‌ను మోడీ వ్యతిరేకిస్తున్నారు. దేశవ్యాప్తంగా ఫ్రీ బస్ స్కీమ్ కావాలని మహిళలు కోరుకుంటున్నారు. కానీ మోడీ దానిని అంతం చేయాలని చూస్తున్నారని అన్నారు.  ప్రధాని, ఆయన మంత్రులు ఫ్రీగా విమానాల్లో ప్రయాణిస్తున్నప్పుడు మహిళలు బస్సులో ఉచితంగా ఎందుకు తిరగొద్దు?’ అని ప్రశ్నించారు.

Spread the love