కి ‘రాక్‌’ డిజైన్స్‌

‘శిలలపై శిల్పాలు చెక్కినారూ’…, ‘రాళ్ళల్లో ఇసుకల్లో రాసామూ ఇద్దరిపేర్లూ’… ఇవి పాతపాటలు కదా … వీటినే రీమిక్స్‌ చేసుకుంటే ?? ఇదిగో ఇలా ”రాక్స్‌’ తో అందాలు దిద్దినారు… మనవారు గార్డెన్‌ లకే కళాసష్టిని అందించినారూ” అంటూ ఈ ప్రాచీన రాతికళకు సొంత ప్రతిభ కలగలిపి ఆపాదించి, ఇప్పుడు పాడుకుంటున్నారు క్రియేటివ్‌ ఆర్టిస్టులు. నున్నగా నునుపుదేలిన రాళ్ళు, గ్రేనెట్‌ రాతి ముక్కలూ, చిన్నాపెద్ద బండరాళ్ళు… ‘ఏ రాయి అయితేనేం’ ఆకట్టుకునేందుకు?!! ఇలా అద్భుతమైన ఉద్యానవనాలకూ, ఇంటి గోడలకూ, పార్కులకూ సొబగులు దిద్దేస్తున్నారు. విల్లాలు కట్టుకునేవారు, ఇంటిముందు విశాలమైన పచ్చిక ఏర్పాటు చేసుకున్నవాళ్ళకూ, ఇంటిలోపల కూడా గోడలకు, ఫొటో ఫ్రేములకు చిన్న చిన్న ‘రాక్స్‌’ తో కిరాక్‌ అనిపించేలా డిజైన్స్‌ అందిస్తున్నారు. ఈ చిత్రాలు చూస్తే మనం కూడా మరిన్ని సరికొత్త అందాల్ని ఇళ్లనీ ఆఫీసుల్నీ తీర్చిదిద్దుకోవచ్చు. ప్రయత్నిస్తే పోయేదేముంది… సరికొత్త ఆవిష్కరణ సాక్షాత్కరిస్తుంది. అంతే!..
– ఆనంద ‘మైత్రేయ’మ్‌, హైదరాబాద్‌

Spread the love