యవ్వనంలో బాల్యాన్నే ప్రేమిస్తారు

In youth they love childhoodఒక సినిమాకి జన్మనిచ్చేది కథా రచయిత.. ఆ కథకు ఊహలకి రెక్కలిచ్చి.. ప్రేక్షకుడి మనసులు గెలిచేలా రాసేది దర్శకుడు. చూసేవాళ్లకి సినిమా ఓ రంగుల ప్రపంచం అయితే.. తీసేవాళ్లకి, నటించేవాళ్లకి అదోక జీవిత కల. అది నెరవేరాలంటే.. ప్రతిభ తప్పనిసరి. పదిమందిని మెప్పించాలి. అవకాశాలు అందిపుచ్చుకోవాలి. నిజానికి సినిమాలు అందరూ చూస్తారు… కానీ, సినిమా కథలు కొందరే రాస్తారు. తన జీవితాన్నే కథగా మలిచి, సినిమా తీసేవాళ్లు అరుదు. ఈ మధ్యకాలంలో విడుదలైన ‘చ90 ఏ మిడిల్‌ క్లాస్‌ బయోపిక్‌’ వెబ్‌ సిరీస్‌ ఆ కోవకు చెందిందే. ప్రముఖ నటుడు శివాజీ ప్రధాన పాత్రలో నటించగా … ఆదిత్య హాసన్‌ ఈ వెబ్‌ సిరీస్‌ కు దర్శకత్వం వహించాడు. ఈ వెబ్‌ సిరీస్‌ విడుదల అయిన తర్వాత దీనికి ప్రేక్షకుల నుండి, విమర్శకుల నుండి అద్భుతమైన ప్రశంసలు వచ్చాయి. అంతేకాదు, నవ యువకుడైన దర్శకుడు ఆదిత్య హాసన్‌ కు తెలుగు సినీ పరిశ్రమలో దిగ్గజ నిర్మాణ సంస్థల నుండి క్రేజీ సినిమా అవకాశాలు వస్తున్నాయి. యువ దర్శకులు (చ90ఫేమ్‌) ఆదిత్య హాసన్‌ గారితో ముఖాముఖి
మీ కథ ఏమిటి? మీరు ఎలా, ఎక్కడ ప్రారంభించారు?
నేను తెలంగాణలోని వనపర్తికి చెందినవాడిని. నేను 1994లో పుట్టి 10వ తరగతి వరకు అక్కడే చదువుకున్నాను. నా ఇంటర్మీడియట్‌కి హైదరాబాద్‌కు వెళ్లి హోటల్‌ మేనేజ్‌మెంట్‌ పోస్ట్‌ చేశాను. ఏడాది పాటు హైదరాబాద్‌లోని సబ్‌వే రెస్టారెంట్లకు ఏరియా మేనేజర్‌గా పనిచేశాను. కానీ, నా దష్టి సినిమాపై ఉండేది. అందుకే సినిమాల్లో నా అదష్టాన్ని పరీక్షించుకోవాలనుకున్నాను. అవకాశాల కోసం ఒక ఏడాది పాటు తిరిగాను. కానీ ఏదీ ఫలించలేదు.
మా నాన్న, గణిత ఉపాధ్యాయుడు, హెడ్‌మాస్టర్‌ కూడా. నేను బాగా చదువుకొని విదేశాలకు వెళ్లాలని ఆయన కోరిక. నాకు ప్రయాణం అంటే చాలా ఇష్టం కాబట్టి, ఆ దిశగా నా ప్రయత్నాలు చేస్తూ అందుకు సంబంధిత పరీక్షలు రాసి, బోర్న్‌మౌత్‌ విశ్వవిద్యాలయం నుండి స్కాలర్‌షిప్‌ పొంది చదువుకోవడానికి యూకే వెళ్ళాను. అక్కడే నేను అప్పటికే రెండు ఇండీ చిత్రాలకు దర్శకత్వం వహించిన నవీన్‌ మేడారంను కలిశాను. ‘బాబు బాగా బిజీ (2017)కి దర్శకత్వం వహించిన నవీన్‌ మా పూర్వ విద్యార్థి అని మా యూనివర్సిటీ వెబ్‌సైట్‌ నుండి తెలుసుకున్నాను. అప్పటికే అక్కడ ఒక తెలుగువాడు చదువుకుని అతని వద్దకు చేరుకున్నాడని నేను తక్షణమే ఆకర్షితుడయ్యాను. 2017లో నేను పని చేస్తున్నప్పుడు తీసిన ‘లగ్గం’ లఘు చిత్రం ఆయనకు నచ్చింది. నేను హైదరాబాద్‌కు తిరిగి వచ్చినప్పుడు తనను కలవమని చెప్పాడు. ఖఖ లో కొంతకాలం పనిచేసిన తరువాత భారతదేశానికి తిరిగి వచ్చాను. దీూఉలో పని చేసాను, =aజూఱసశీ నడిపాను. తల్లిదండ్రులపై ఆధారపడటం ఇష్టం లేక ఉన్న ఏ అవకాశాన్ని వదులుకోలేదు.
ఏ రచయితైనా తాను రాసే వాక్యంలో కనీసం ఒక అక్షరమైనా తన అనుభవం ఉంటుంది.
ఈ ‘చ90’ మీదా? మీరు గమనించిన మనుషులదా?
రెండు అనుకోవచ్చు. వాస్తవానికి ఇక్కడ కొన్ని విషయాలు చెప్పాలి. కొత్తగా డైరెక్టర్‌ వచ్చి సినిమా చేస్తానంటే ఎవరు నమ్మరు. అందుకని పెద్దపెద్ద కథలు, పెద్ద బడ్జెట్‌లో రాసుకొని వాటి ప్రయత్నాలలో జిగ్‌ జాగ్‌ చెయ్యకూడదని చెప్పి తక్కువ బడ్జెట్లో మహా అయితే రెండు కోట్లతో అయితేనే మనం సినిమా చేయగలుగుతాం అని ఆలోచించినప్పుడు అందులో అన్ని కథలు పోను మిగిలింది, నాకు బాగా నచ్చింది ఈ నోస్టాల్జియా. ఇది అప్పటికి ఎవరు పెద్దగా టచ్‌ చేయని సబ్జెక్టుగా అనిపించింది. ప్రాపర్‌ మిడిల్‌ క్లాస్‌ లైఫ్‌ చూపిద్దాం. ఇంతవరకు చూపించిన మిడిల్‌ క్లాస్‌లైఫ్‌ కాకుండా వాస్తవంగా ఉండే డిష్‌ కనెక్షన్‌ గొడవలు, చిట్టీలు కట్టుకునే ఇబ్బందులు, చదువుని ఆస్తిగా భావించే తీరు వంటి అచ్చమైన మిడిల్‌ క్లాస్‌ తీద్దాం అన్న ఆలోచనలో భాగంగానే ఈ నేటివిటీ ఉన్న మిడిల్‌ క్లాస్‌ సినిమాని చేయాలనుకున్నా. సినిమా మొదట్లో చెప్పినట్టుగా ఇది కేవలం అనుభూతుల సమాహారం. ఈ సినిమా రాసే, తీసే క్రమంలోనే చాలా సంతప్తి కలిగింది. ఎక్కువ సీన్లు మా ఇంట్లో జరిగిన విషయాలే ఉంటాయి. మరికొన్ని నా జీవితంలో గమనించిన వ్యక్తులను ఆధారంగా చేసుకొన్నవి కూడా ఉన్నాయి. ఇలా రెండు అనుకోవచ్చు.
చిత్రసీమలో మీ అరంగ్రేటం అనుకొన్న ప్రణాళికపరంగానే సాగిందా?
చిత్రసీమకు రావాలన్నది నా కాన్సస్‌ నుండి జరిగిందే. కానీ ఈ ఆపర్చునిటీలు మాత్రం అనుకోకుండా వచ్చేశాయి. ఈ ‘చ90’ కంటే ముందు కలర్స్‌ స్వాతి హీరోయిన్‌ గా ‘టీచర్‌’ అనే ఒక సినిమా తీశాను. అది ఇంకా రిలీజ్‌ కావాల్సి ఉంది. కొద్దిగా ఆలస్యం అవుతూ ఉండడం ద్వారా అనుకోకుండానే ఈ వెబ్‌ సిరీస్‌ రాసుకోవడం, ఈటీవీ విన్‌ వాళ్ళ ద్వారా సినిమాల్లోకి రావడం అలా జరిగిపోయింది. ప్రతిదీ ఒక ఫ్లోలో జరుగుతూ పోయిందే తప్పితే దేన్నీ నేను ప్రత్యేకించి ప్రణాళిక వేసి చేసిందంటూ ఏమి లేదు. కాకపోతే ఇచ్చిన అవకాశానికి న్యాయం చేశాను.
చిత్రనిర్మాణంలో మీకు ఏవిధమైన స్వేచ్ఛా సాకారాలు ఇచ్చారు?
అప్పటికి నేను ‘చ90’ పట్టుకొని ‘ఈటీవి విన్‌’ తప్ప అన్ని ఓటిటి సంస్థల్ని తిరగేశాను. నచ్చకపోవడం… తిరస్కరించడం… కొందరికి నచ్చినా సినిమాగా మారకపోవడం… నేను తియ్యగలనా అన్న అనుమానం ఉండేవి. అన్ని తిరిగేశాం కదా ఈ ‘ఈటీవి విన్‌’ వాళ్ళకు ఒకసారి చెబితే పోలా అని ప్రయత్నం చేశా. వెళ్ళేటప్పుడు ఏవిధమైన నమ్మకం లేదు. అన్నిటిలానే వీళ్ళు కూడా రిజక్ట్‌ చేస్తారు అనుకొన్న. వెళ్ళి చెప్పగానే వాళ్లకు ఎంతగానో నచ్చింది. కేవలం వారంలోనే జరగవలసిన రిజిస్టర్‌ ప్రాసెస్‌ అంతా జరిగిపోయింది.
కేవలం 24 రోజుల్లో మూడున్నర గంటల నిడివి కలిగిన 6 ఎపిసోడ్లను తియ్యగాలిగాను అంటే అది వాళ్ళు ఇచ్చిన స్వేచ్ఛనే కారణం. ఒక దశలో నేను లో గా ఫీలైనా వాళ్ళు మాత్రం ఆత్మవిశ్వాసంతో ఉన్నారు. వాస్తవానికి ఏ సంస్థలోనైనా ఏ డైరెక్టర్‌ కైనా స్వేచ్ఛ ఉంటుంది. ఎప్పటివరకు అంటే సినిమా నిర్మాణంలో తలెత్తే ప్రశ్నలకు అతడి దగ్గర సమాధానం ఉన్నప్పటివరకు. నా వరకు ‘ఈటీవి విన్‌’ వాళ్ళ ద్వారా పూర్తి సహకారం దొరికింది.
నేటి యువ దర్శకులు తొందరగా విఫలం అవ్వడానికి ‘థియరీ ఎక్కువ- ప్రాక్టికల్‌ తక్కువ’న్న విమర్శ నిజమేనా?
నేను విఫలం అయ్యే అంతవరకు దానికి రీజన్‌ ఏంటో నాకు తెలియకపోవచ్చు అనుకొంటా (నవ్వుతూ). ఇండిస్టీలో ఏ హీరోనయినా ఎక్కడ ఫిలిం కోర్స్‌ చేసి వచ్చావు? ఏం చదువుకున్నావు? అన్నది చూసి సినిమా ఇవ్వరు. కేవలం నువ్వు రాసిన స్క్రిప్ట్‌ ని చదివే అవకాశం ఇస్తాడు. సో ఎక్కువ సినిమాలు చేసినా, అసలు సినిమాలు చేయకపోయినా ఫైనల్‌ గా స్క్రిప్ట్‌ మాత్రమే కీరోల్‌ ప్లే చేస్తుంది. అది బలంగా లేనప్పుడు పెద్ద డైరెక్టర్‌ అయిన చిన్న డైరెక్టర్‌ అయినా ఫలితంలో వ్యత్యాసం ఉండదు. సినిమా ప్రేక్షకులకు ఏ కోణంలో నచ్చుతుందో అన్నదాన్ని బట్టి దర్శకుడు ఎదుగుతాడు. నాకు తెలిసినంతవరకు ఇండిస్టీలో ‘థియరీ-ప్రాక్టికల్‌’ మోతాదులు సరాసరి ఇంత ఉండాలని కొలమానమంటూ ఏది ఉండదు.
‘ఎవరి దగ్గర పనిచేయ్యకుండానే సినిమా తీసేయ్యాలి’ అన్నది చిత్రసీమకి ప్రయోజనమా? ప్రమాదమా?
వాస్తవానికి దీన్ని అంత పెద్ద అంశంగా పరిగణించకూడదు. చిత్రసీమకు అనుభవం ఉన్నవాళ్లు వచ్చినా, అనుభవం లేకుండా వచ్చి సినిమా తీసినా ఇండిస్టీకి ఎటువంటి ప్రమాదమూ ఉండదు. ఎందుకంటే ఇండిస్టీ మొత్తం కలిసి ఒక్క సినిమా తియ్యరు కాబట్టి. ఒక్కోరు ఒక్కొక్క కోణంలో సినిమా తీస్తూ ఉంటారు. సినిమా తీయబోతున్న సబ్జెక్ట్‌ ని బట్టి జయాపజయాలు ఉంటాయి. ఒకవేళ కొత్తవాళ్ళందరు వచ్చి ఫ్లాప్‌ లు తీసినా ఇండిస్టీకి వచ్చిన నష్టమంటూ ఏదీలేదు. ఫ్లాప్‌ అన్నది కొంతమందికి నష్టం వచ్చినా చాలామందికి ఉపాధి దొరుకుతుంది. ఈ విధానాన్ని అంత నెగిటివ్‌గా చూడాల్సిన అవసరం అయితే లేదు.
బాల్యాన్ని వద్ధాప్యంలో ఎక్కువగా ప్రేమిస్తారు. మీరు యవ్వనంలోనే వాటిపై అంత మక్కువ కలిగివుండడానికి కారణమేంటి?
మారుతున్న జీవనశైలే అందుకు కారణం. దీనివల్ల గతంమీద నమ్మకం, భవిష్యత్తుమీద ఆలోచనలు పెరుగుతాయి. ఒక సమయంలో చిన్నగా ఉన్నప్పుడు పెద్దగైతే బాగుంటుంది అనిపిస్తుంది. అదే పెద్దయ్యాక స్కూల్‌ లైఫే బాగుందనిపిస్తుంది. సహజంగా కాలేజ్‌ అయ్యిపోయాక స్కూల్‌ డేస్‌ బాగా గుర్తుకువస్తాయి. జీవితంలో ఒక దశకి వెళ్ళాక ఇప్పుడున్న దశ చాలా బాగుంటుందనిపిస్తుంది. ఎందుకంటే స్కూల్‌ మెమోరీస్‌ వద్ధాప్యంలోకి వెళ్లాక చాలా మరిచిపోతాం. అది ఎక్కువగా గుర్తొచ్చేది యవ్వనంలోనే… అందుకే నేను స్కూల్‌ గురించి అప్పటి జీవితం గురించి తీయడానికి ఆసక్తి చూపాను. బహుశా ఒకదశకు వెళ్లాక ఇప్పుడున్న జీవితం గురించి తీస్తానేమో (నవ్వుతూ)
దర్శకులుగా ఎదగడానికి ఏయే పుస్తకాలు తోడ్పడ్డాయి?
వాస్తవానికి నేను పెద్దగా ఏ పుస్తకాలూ చదవలేదు. ఆఖరికి సినిమాకి సంబంధించిన పుస్తకాలు కూడా. ఇప్పటికీ నేను పుస్తకాలు పెద్దగా చదవలేకపోయానే అని వెలితిగా భావిస్తుంటాను. బయట ఎంతోమంది మిత్రులు పుస్తకాలు చదవమని ఇస్తూ ఉంటారు. ముఖ్యంగా యువరచయితలు. అవన్నీ తీసుకొచ్చి అలా అల్మారాలలో పెట్టడమే సరిపోతుంది కానీ చదివేంత అవకాశం దొరక్కపోవడం జరుగుతూనే ఉంది. ఒక రకంగా చెప్పాలంటే తెలుగు వేగంగా రాయడం, చదవడం కూడా రాదు. మహాప్రస్థానం చదువుదామని ఎంతో ప్రయత్నించినా కొన్ని పదాలు నా నోరు కూడా తిరగలేదు. ఒకటి రెండు సినిమాలు చేసి తప్పకుండా పుస్తకాలు చదవడానికి బ్రేక్‌ తీసుకొంటా.
ప్రభావం చూపిన సినిమాలు, దర్శకులు?
నన్ను దర్శకుడు అవ్వాలన్నంత ప్రభావితం చేసిన సినిమాలేవీ లేవు. సినిమా చేస్తున్నప్పుడు కూడా ఇలా చేయాలి, అలా చేయాలన్నంత ఇతరుల ప్రభావానికి కూడా నేను గురికాలేదు. వాస్తవానికి ఎవరైనా సినిమా డైరెక్టర్‌ అవ్వాలని ఒక దశలో చాలా డీప్‌ ఫోకస్‌లో ఉంటాడు. ఆ సమయంలో అతడికి రిజెక్ట్‌నెస్‌ ఎక్కువగా ఉంటుంది. అప్పటికి నువ్వు అన్నింటినీ వదిలిపెట్టి చిత్రసీమలోకి రావడం… ఆర్థిక బలహీనత ఉండడం… తోటి మిత్రుల లైఫ్‌ సెటిల్మెంట్‌ అయిపోయినా మనం కాకుండా ఉండడం… కుటుంబ సహకారం తగ్గుతూ రావడం… ప్రేమించిన అమ్మాయి చేజారిపోతుండడం… వంటి సందర్భాలు ఎక్కువగా ఉంటాయి. మరోవైపు సినిమాకథ చెబితే కొంతమందికి నచ్చకపోవడం… నచ్చినా సినిమాగా కాకపోవడం… వంటి క్లిష్ట పరిస్థితుల్ని కూడా ఎదుర్కొంటుంటాడు. అటువంటి సందర్భంలో కూడా నమ్మకంగా ఉంటే కచ్చితంగా విజయం సాధిస్తావ్‌. ఆ సందర్భంలో నువ్వు తెలుసుకోవాల్సిన అసలు వాస్తవం ఏందంటే ఈ ఫేజ్‌ జీవితాంతం ఉంటుందని. నీకు నిరంతరం విజయం వచ్చినా అదే ఫేజ్‌లో ఉంటావు. ఓటమి వచ్చిన అదే ఫేజ్‌లో ఉంటావని నువ్వు ఆలోచించగలిగినప్పుడు కచ్చితంగా విజయం సాధిస్తావ్‌. ఒకవేళ సాధించకపోయినా ‘నేను అలా ప్రయత్నించలేద’న్న విచారం నీ జీవితంలో ఉండదు. ఇది చాలా కీలకం. ఏ ఫిలింమేకర్‌ కైనా ‘ఫెయిల్యూర్‌ ఈజ్‌ నాట్‌ అబౌట్‌ విన్నింగ్‌ అండ్‌ లూజింగ్‌. ఫెయిల్యూర్‌ ఈజ్‌ వెన్‌ యు స్టార్ట్‌ రిగ్రేటింగ్‌.’ ఈ విషయంలో నాకు పూర్తి స్పష్టత ఉంది.
సినిమా ప్రయాణంలో నన్ను వ్యక్తిగతంగా ప్రభావితం చేసింది వేణు ఉడుగుల, తరుణ్‌ భాస్కర్‌, వెంకట్‌ మహా. వీళ్లు తీసిన సినిమాలకంటే వీళ్ళు సినిమా చేయడం కోసం ఇటువంటి సందర్భాలను ఎలా తట్టుకుని నిలబడ్డారు అన్న అంశాలే నన్ను ఎక్కువ ప్రభావితం చేశాయి. అటువంటి క్లిష్ట సందర్భాలు దాటివచ్చి ఒక సక్సెస్‌ కొట్టారు కదా అన్నదే మాలాంటి ఫిలిం మేకర్స్‌కు ఒక ఇన్స్పిరేషన్‌ కలిగిస్తాయి. ఒకరకంగా చెప్పాలంటే మెంటల్‌ స్టెబిలిటీ నుంచి ప్రభావితమైనవాడిని తప్ప… కొన్ని సినిమాలు, కొందరు దర్శకులు అంటూ ఏమి లేదు.
‘అనువాద సినిమా’ – ‘స్వతంత్ర సినిమా’లకు సంభాషణలు రాయడంలో ఉన్న వ్యత్యాసాలు?
ఒక రచయితగా ఈ రెండింటి మధ్య ప్రధానంగా తేడా గమనిస్తే… స్వతంత్ర సినిమా అన్నది మీ ఇంట్లో మీరు మీకు నచ్చినట్లుగా ఉండడం లాంటిది. అనువాద సినిమాకు రాయడం ఇతరుల ఇంట్లో నువ్వు అతిథిగా ఉండడం. వాళ్ళ విధానాలకు లోబడి మీ పరిధిలో మీరు నడుచుకోవాల్సి ఉంటుంది. అనువాద సినిమాకి రాస్తున్నప్పుడు స్వేచ్ఛ తక్కువగా ఉంటుంది. దర్శకుడి విజన్‌కు లోబడి మాటలు రాయవలసి ఉంటుంది. ఈ అనువాద సినిమాలో ప్రేక్షకులకంటే దర్శకుడుని ఎక్కువ మెప్పించాల్సి ఉంటుంది. దర్శకుడుకి ఎంతమేరకు న్యాయం చేయగలుగుతున్నామన్నది ప్రధానంగా ఉంటుంది. అలాగే రాస్తున్న భాషలో ప్రేక్షకులకు ఎంత దగ్గరగా తీసుకెళ్తున్నాం అన్నది కూడా ప్రధానమే. ఈ విధమైన నిబంధనలు స్వతంత్ర సినిమాలో ఉండవు. ఈ ‘ప్రేమలు’ సినిమాకు తెలుగులో సంభాషణలు రాయడం ద్వారా తెలిసిన విషయం ఏమంటే అనువాద సినిమా అన్నది రచయితకు సవాలుగానే ఉంటుంది.
మొదటి సినిమా విజయం రెండో సినిమాకు అంచనాలు పెంచుతుంది. అది మీకు ఒత్తిడిగా ఉందా? ఉత్సాహం కలిగిస్తుందా?
రెండు కలిగించవు. నాకు ప్రధానంగా ఉండేది కథపరంగా సినిమాను ఎలా తీస్తున్నాం అన్నది తప్పితే ఇంకేమి మైండ్‌ లో ఉండవు. సినిమా తీస్తున్నప్పుడు కూడా ప్రేక్షకుడి కోణంలో నుంచి ఆలోచించను. రాస్తున్నప్పుడు నాకు సంతప్తినిచ్చిందా అన్నదే ప్రధానం. నాకు సంతప్తి కలిగితే ఖచ్చితంగా ప్రేక్షకులకు కూడా సంతప్తినిస్తుందని బలంగా నమ్ముతా. ప్రేక్షకుల గురించి ఎక్కువగా ఆలోచించను కాబట్టి వాళ్ళనుంచి ఒత్తిడి ఉండదు. ఉత్సాహం కూడా ఉండదు. నాకు సినిమా తీయడానికి దొరికిన అవకాశాన్ని ఎంత ఉన్నతంగా తియ్యగలనన్న ఆలోచన తప్పితే మరే ఇతర అంశాలకు నేను ప్రభావితంకాను.
తదుపరి మీ ‘ఫిల్మోగ్రఫీ’ ్‌శీ సశీ శ్రీఱర్‌ లో ఏయే ప్రాజెక్ట్స్‌ ఉన్నాయి?
మొన్ననే ‘ప్రేమలు’ సినిమాకి తెలుగులో సంభాషణలు రాశా. ప్రస్తుతానికి నితిన్‌ గారితో ఒక లవ్‌ స్టోరీ చేద్దామన్న ప్రాసెస్‌ నడుస్తుంది. మైండ్‌ లో ఏవేవో తిరుగుతున్నా ఇప్పటికైతే ఇదో సినిమానే ఉంది.

– మదన్‌ మోహన్‌ రెడ్డి 9989894308

Spread the love