
నవతెలంగాణ – మల్హర్ రావు
మహముత్తారం మండల కాంగ్రెస్ పార్టీ మహిళ అధ్యక్షురాలు,మండల కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకురాలు జాడి కీర్తి భాయి ఇటీవల రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన విషయం తెలిసిందే. సోమవారం దశదిన కార్యక్రమంలో రాష్ట్ర ఐటి,పరిశ్రమల,శాసనసభ వ్యవహారాల మంత్రి దుద్దిళ్ల శ్రీదర్ బాబు సోదరుడు, శ్రీపాద ట్రస్ట్ చైర్మన్ దుద్దిళ్ల శ్రీనుబాబు పాల్గొనీ బాధితురాలు కుటుంబ సభ్యులను పరామర్శించి, ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. కాంగ్రెస్ పార్టీ అధ్వర్యంలో ఏర్పాటు చేసిన సంతాప సభలో శ్రీనుబాబు కీర్తిబాయి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా శ్రీనుబాబు మాట్లాడారు కీర్తిబాయి మరణం కాంగ్రెస్ పార్టీకి తీరని లోటమీ, పార్టీ కోసం ఎనలేని కృషి చేసిందని కొనియాడారు. కాంగ్రెస్ పార్టీ ఒక మంచి నాయకురాలిని కోల్పొయిందని బావగ్వాదేహానికి గురైయ్యారు. జాడి కీర్తి భాయి అంటే ధైర్యం, చిత్తశుద్ధని,ఆమె బస్ లో,కార్ లో,బైక్ ల మీద లిఫ్ట్ లు అడిగి పగలనక రాత్రనక ప్రజల కోసం వెళ్లి ప్రజల కష్ట సుఖాలు తెలుసుకొని సమస్యల పరిష్కారమయ్యేవరకు పట్టువిడువని లీడర్ కీర్తీ భాయిని, ఆమె లాంటి లీడర్ మల్ల పుట్టరన్నారు. యంగ్ లీడర్ జాడి కీర్తి భాయి మన అందరి గుండెల్లో ఉన్నారని,ఆమె కుటుంబ సభ్యులకు అండగా ఉంటామన్నారు. ఆమె ఆత్మకి శాంతి చేకూరాలని ఆ భగవంతున్ని కోరుకుంటూ మరోసారి వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులు, నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు.