మొక్కలు నాటిన కోలేటి దామోదర్‌, డీజీపీ

నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
పర్యావరణ దినోత్సవం సందర్భంగా రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్‌కుమార్‌ చేపట్టిన ‘గ్రీన్‌ ఇండియా ఛాలెంజ్‌’ స్పూర్తితో రాష్ట్ర పోలీసు హౌసింగ్‌ కార్పొరేషన్‌ చైర్మెన్‌ కోలేటి దామోదర్‌, డీజీపీ అంజనీకుమార్‌ కలిసి డీజీపీ కార్యాలయ ప్రాంగణంలో మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర పోలీసు హౌసింగ్‌ కార్పొరేషన్‌ ఎండీ రాజీవ్‌రతన్‌, అడిషనల్‌ డీజీ (లా అండ్‌ అర్డర్‌) సంజరుకుమార్‌ జైన్‌, డీఐజీ(పీఅండ్‌ఎల్‌) ఎం.రమేష్‌, ఐజీ(పర్సనల్‌) కమలాహసన్‌రెడ్డి, ఐటీ(ఇంటలిజెన్స్‌) శివకుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

Spread the love