విద్యుత్‌ సౌధలో ‘దశాబ్ది’ వెలుగులు

నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
నాణ్యమైన నిరంతర విద్యుత్‌ సరఫరా ప్రతిభ కచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వానిదేనని టీఎస్‌జెన్‌కో, ట్రాన్స్‌కో సీఎమ్‌డీ దేవులపల్లి ప్రభాకరరావు అన్నారు. సీఎం కేసీఆర్‌ ముందుచూపుతోనే ఈ విజయం సాధ్యమైందనీ, విద్యుత్‌ విజయం ఫలితంగా అన్నిరంగాల్లో రాష్ట్రం పురోగమిస్తున్నదనీ చెప్పారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా సోమవారం ఖైరతాబాద్‌లోని విద్యుత్‌సౌధలో ‘విద్యుత్‌ విజయోత్సవం’ జరిగింది. ఈ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. 9 ఏండ్లలో రాష్ట్రంలో విద్యుత్‌ సరఫరా, పంపిణీ వ్యవస్థల ఆధునీకరణ కోసం రూ.97,321 కోట్లు ఖర్చు చేశామని తెలిపారు. రికార్డు సమయంలో కొత్త విద్యుదుత్పత్తి కేంద్రాలు పూర్తిచేశామన్నారు. పారిశ్రామిక, వాణిజ్య పెట్టుబడులు పెరిగాయని చెప్పారు. తలసరి విద్యుత్‌ వినియోగంలో రాష్ట్రం అగ్రస్థానంలో ఉందని వివరించారు. ఈ సందర్భంగా విద్యుత్‌సౌధను రంగురంగుల దీపాలతో అలంకరించారు. మామిడితోరణాలు కట్టి, కార్యాలయంలో పండుగ వాతావరణం కల్పించారు. ఉద్యోగులు సంబురాల్లో సంతోషంగా పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వ కృషిని కొనియాడారు. కార్యక్రమంలో విద్యుత్‌ సంస్థల డైరెక్టర్లు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

Spread the love