టీడీపీ నూతన కార్యవర్గంలోకి మరో 28 మంది

నవతెలంగాణ-హైదరాబాద్‌
తెలుగుదేశం తెలంగాణ శాఖ రాష్ట్ర కమిటీ విస్తరణలో భాగంగా రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్‌ మరో 28 మందికి నూతన కార్యవర్గంలో చోటు కల్పించారు. పార్టీ చేనేత విభాగం అధ్యక్షుడుగా బడుగు దానయ్య (భువనగిరి), తెలుగునాడు ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర అధ్యక్షుడిగా ముంజా వెంకట రాజంను (స్టేషన్‌ ఘనపూర్‌) నియమించారు. ఈమేరకు బుధవారం వీరికి నియామక ఉత్తర్వులను ఇచ్చారు. తాజా నియామకాలతో కలిపి తెలంగాణ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యవర్గం సభ్యుల సంఖ్య 61కి చేరింది. బుధవారం ప్రకటించిన జాబితాలో రాష్ట్ర కార్యవర్గంలో ఒకరిని ఉపాధ్యక్షులుగా, ముగ్గురిని ప్రధాన కార్యదర్శులుగా, ఐదుగురిని అధికార ప్రతినిధులుగా, ఎనిమిది మందిని కార్యనిర్వాహాక కార్యదర్శులుగా, పదకొండు మందిని కార్యదర్శులుగా నియమించారు. మరో విడతలో పూర్తి స్థాయి కమిటీ నియమిస్తామని కాసాని జ్ఞానేశ్వర్‌ తెలిపారు. సీనియార్టీ, పనితీరు, ప్రాంతాలు, ఇతర సమీకరణాలను దష్టిలో ఉంచుకొని మహానాడు అనంతరం మరో విడత రాష్ట్ర కార్యవర్గాన్ని విస్తరిస్తామని చెప్పారు. అర్హులైన నాయకులకు పార్టీ అనుబంధ విభాగాల్లో అవకాశం కల్పిస్తామని ఒక ప్రకటనలో పేర్కొన్నారు.

Spread the love