టీడీపీ, వైసీపీలకు బీఆర్‌ఎస్సే ప్రత్యామ్నాయం

– బీఆర్‌ఎస్‌ ఏపీ అధ్యక్షులు డాక్టర్‌ తోట చంద్రశేఖర్‌
తెలుగుదేశం పార్టీ, వైఎస్సాఆర్‌ కాంగ్రెస్‌ పార్టీలకు బీఆర్‌ఎస్‌ పార్టీయే ప్రత్యామ్నాయమని ఆ పార్టీ ఆంధ్రప్రదేశ్‌ అధ్యక్షులు డాక్టర్‌ తోట చంద్రశేఖర్‌ తెలిపారు. శనివారం హైదరాబాద్‌లోని బీఆర్‌ఎస్‌ ఏపీ క్యాంపు కార్యాలయంలో కాపు సంక్షేమ యువసేన రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్‌ అర్కాట్‌ కృష్ణ ప్రసాద్‌ తదితరులు తోట సమక్షంలో బీఆర్‌ఎస్‌ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా తోట చంద్రశేఖర్‌ మాట్లాడుతూ టీడీపీ, వైసీపీల పాలనలో సామాన్యులు బతకలేని పరిస్థితులు నెలకొన్నాయని విమర్శించారు. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌ ప్రజలు కేసీఆర్‌ నాయకత్వాన్ని కోరుకుంటున్నారని తెలిపారు. బీఆర్‌ఎస్‌ బలోపేతానికి కృషి చేయాలని కొత్త పార్టీలో చేరిన వారికి ఈ సందర్భంగా తోట సూచించారు.

Spread the love