టీడీపీతోనే తెలంగాణ ఆవిర్భావం

– అవతరణ దినోత్సవంలో కాసాని
నవతెలంగాణ-హైదరాబాద్‌
తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావం ఒక చరిత్ర అనీ, టీడీపీ నిర్ణయమే తెలంగాణ సాకారం కావడంలో కీలకమని ఆపార్టీ అధ్య క్షులు కాసాని జ్ఞానేశ్వర్‌ అన్నారు. తెలంగాణ స్వరాష్ట్రాన్ని సాధించు కున్నప్పటికీ విద్యార్థులు, యువత, అమరవీరులు కలలుగన్న సమ సమాజం రాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. శుక్రవారం ఎన్టీఆర్‌ భవన్‌లో జరిగి ఆవిర్భావ దినో త్సవ వేడుకల్లో ముఖ్య అతిథిగా పాల్గొన్న కాసాని జ్ఞానేశ్వర్‌, జాతీయ జెండాను ఆవిష్క రించారు. అనంతరం తెలుగు దేశం పార్టీ జెండాను ఎగురవేశారు. టీడీపీ పార్టీ నాయకులు ఎన్టీఆర్‌ విగ్రహానికి పూలమాలలు వేశారు. ఈ సందర్భంగా కాసాని జ్ఞానేశ్వర్‌ మాట్లాడుతూ నీళ్లు, నిధులు, నియామకాలు నినాదంతో రాష్ట్రం ఏర్పడిందన్నారు. 1969 తెలంగాణ ఉద్యమ సందర్భంలో మేము యువకులుగా ఉన్నాం. ఆనాడు యువత, విద్యార్థులు తుపాకులకు ఎదురొడ్డి పోరాటం చేసి అమరులయ్యారు. మలిదశ తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ రాష్ట్రం రావడం లేదంటూ అదే యువత, విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారని వివరించారు. పోలీస్‌ కిష్టయ్య, శ్రీకాంతాచారి తదితరులు ఆత్మబలిదానాలు చేసుకున్నారని వివరించారు. ఈ కార్యక్రమంలో జాతీయ పార్టీ అధికార ప్రతినిధి ప్రొఫెసర్‌ తిరునగరి జ్యోత్స్న, రాష్ట్ర పార్టీ ఉపాధ్యక్షురాలు కాట్రగడ్డ ప్రసూన, రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు జక్కలి ఐలయ్య యాదవ్‌, అజ్మీరా రాజునాయక్‌, రాష్ట్ర పార్టీ అధికార ప్రతినిధులు నెల్లూరి దుర్గాప్రసాద్‌, సూర్యదేవర లత, మీడియా వ్యవహారాల కో-ఆర్డినేటర్‌ బియ్యని సురేష్‌, కార్యనిర్వాహక కార్యదర్శులు సాయి తులసి, తెలుగు మహిళ రాష్ట్ర అధ్యక్షురాలు షకీలారెడ్డి, ఎస్సీ సెల్‌ రాష్ట్ర పార్టీ అధ్యక్షులు పోలంపల్లి అశోక్‌, తెలుగుయువత రాష్ట్ర అధ్యక్షులు పొగాకు జయరామచందర్‌, టీఎన్‌ఎస్‌ఎఫ్‌ రాష్ట్ర అధ్యక్షులు పర్లపల్లి రవీందర్‌, పార్టీ రాష్ట్ర నాయకులు కాసాని వీరేష్‌ పాల్గొన్నారు.

Spread the love