Saturday, May 2, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్పది ఫలితాల్లో కోనాపూర్ పాఠశాల ఘనత

పది ఫలితాల్లో కోనాపూర్ పాఠశాల ఘనత

- Advertisement -

–  వరుసగా 15 సార్లు 100 శాతం ఉత్తీర్ణత 
– హర్షం వ్యక్తం చేస్తున్న గ్రామస్తులు 
నవతెలంగాణ-కమ్మర్ పల్లి 
మండలంలోని కోనాపూర్ జిల్లా ప్రసన్నత పాఠశాల పదవ తరగతి ఫలితాల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరుస్తూ 100 శాతం ఉత్తీర్ణతతో ప్రత్యేకతను సంతరించుకుంది. గత 15 సంవత్సరాలుగా 2010_2011 బ్యాచ్ నుండి వరుసగా నేటి వరకు  100 శాతం ఫలితాలు సాధిస్తూ విజయపరంపరను కొనసాగిస్తుంది. గ్రామస్తుల సహకారం, తల్లిదండ్రుల ప్రోత్సాహం, జిల్లా విద్యాశాఖ అందించిన సూచనలు ఎప్పటికప్పుడు పాటించడం, ఉదయం సాయంత్రం ప్రత్యేక తరగతులు నిర్వహించడం పాఠశాల విజయంలో తోడ్పడ్డాయి. విద్యార్థులందరిని ఉపాధ్యాయులకు దత్తత ఇవ్వడం, విషయ నిపుణులతో వార్షిక పరీక్షల పట్ల అవగాహన కల్పించడం, గ్రాండ్ టెస్టు లు, ప్రీ ఫైనల్ పరీక్షల విశ్లేషణ, ఉపాధ్యాయుల సౌజన్యంతో మోడల్ పేపర్స్ ఎక్కువగా ప్రాక్టీస్ చేయించడం కూడా పాఠశాల 100 శాతం ఉత్తీర్ణత సాధించడంలో దోహదపడ్డాయి. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు చౌడవరపు రాంప్రసాద్ మాట్లాడుతూ… గత 15 సంవత్సరాలుగా పాఠశాల 100% ఉత్తీర్ణత సాధించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. పాఠశాల విజయానికి దోహదపడ్డ విషయాలను ఆయన వెల్లడించారు.స్టూడెంట్స్ కౌన్సిల్ ద్వారా పాఠశాలలో ఉదయం ప్రార్థన, విద్యార్థుల్లో క్రమశిక్షణ, నిరంతర పర్యవేక్షణ, మధ్యాహ్న భోజనం అమలు పర్యవేక్షణ, వ్యక్తిగత పరిశుభ్రతపై అవగాహన కల్పించే కార్యక్రమాల ఏర్పాటు ఉపయోగపడిందన్నారు. పాఠశాలలో జరిగే వివిధ కార్యక్రమాలకు వాలంటీర్ గా విద్యార్థులు పని చేయడం వారిలో నాయకత్వ లక్షణాలు పెంపొందించేందుకు దోహదపడిందన్నారు.

ఎకో క్లబ్, బాలిక సాధికారత క్లబ్, కౌమార భద్రతా క్లబ్, ప్రహరీ క్లబ్, డిజిటల్ లెర్నింగ్ క్లబ్, లైబ్రరీ క్లబ్, స్పోర్ట్స్ అండ్ కల్చర్ క్లబ్ లతో అనుసంధానంగా ఉంటుందన్నారు. పాఠశాల విద్యార్థులను మొత్తం నాలుగు హౌస్ లు అబ్దుల్ కలాం హౌస్, శకుంతల దేవి హౌస్, సివి రామన్ హౌస్, రవీంద్రనాథ్ ఠాగూర్ హౌస్ లుగా ఏర్పాటు చేసినట్లు తెలిపారు. హౌస్ లకు ప్రత్యేకంగా కెప్టెన్, వైస్ కెప్టెన్ ఎన్నిక చేసామన్నారు.  స్కూల్ లీడర్, డిప్యూటీ లీడర్ లను ఎన్నికల ద్వారా ఎంపిక చేసినట్టు తెలిపారు. తద్వారా విద్యార్థుల్లో నాయకత్వ లక్షణాలు పెంపొందుతాయని, భావవ్యక్తీకరణ స్వేచ్ఛ లభిస్తుందన్నారు. జీవన నైపుణ్యాలు, వివిధ రకాలైన సహ పాఠ్య కార్యకలాపాల ద్వారా విద్యార్థులు సమగ్ర అభివృద్ధి చెంది భవిష్యత్తులో ఉత్తమ దేశ పౌరులుగా తీర్చిదిద్దపడతారని తెలిపారు. ప్రతినెల హౌస్ ల మధ్య క్విజ్, వివిధ పోటీ పరీక్షలు నిర్వహించి ఉత్తమ క్లబ్ విద్యార్థులకు ప్రోత్సాహక బహుమతులు అందజేసినట్లు ఆయన వివరించారు. సమగ్ర శిక్ష నిధుల ద్వారా క్లబ్, హౌస్ సిస్టం విద్యార్థులకు అవసరమైన వివిధ రకాల బ్యాడ్జీలు, బ్లేజర్లు, జెండాలు ల, ఇతర సామగ్రి కొనుగోలు చేసినట్లు మదన ఉపాధ్యాయులు రాంప్రసాద్ తెలిపారు. కాగా పాఠశాల విద్యార్థుల గత 15 సంవత్సరాలుగా 100% ఉత్తీర్ణత సాధించడం పట్ల స్థానిక సర్పంచ్ రిక్క అరుణ్ రెడ్డి, పంచాయతీ పాలకవర్గం సభ్యులు హర్షం వ్యక్తం చేశారు. భవిష్యత్తులో కూడా పాఠశాల విద్యార్థులు ఇదే సంప్రదాయాన్ని కొనసాగించాలని ఆకాంక్షించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -