
బీఎస్పీ పార్టీని ఆదరించి ఏనుగు గుర్తుపై ఓటు వేసిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అని ఆ పార్టీ మహబూబాద్ పార్లమెంటు అభ్యర్థి కోనేటి సుజాత ఒక ప్రకటనలో బుధవారం తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రధాన పార్టీ అభ్యర్థులను తల తన్నే విధంగా ప్రచారం నిర్వహించడం జరిగింది అని ఆమె అన్నారు. గ్రామాలలో ప్రజలు నాకు సహకరించిన ప్రతి ఒక్కరికి ప్రత్యేక కృతజ్ఞతలు అని అన్నారు నీకు అండగా ఉంటామని ప్రజలు తెలపడం నాకు ఎంతో సంతోషంగా ఉందని అన్నారు ఇందుకు సహకరించిన బి ఎస్ పి పార్టీ నాయకులకు,కార్యకర్తలకు , మహిళా నాయకురాల్లకు ధన్యవాదాలు అని ఆమె అన్నారు.బి ఎస్ పి పార్టీ గెలిస్తేనే పార్లమెంట్ లో బహుజన వాదం వినిపించడానికి అవకాశం ఉంది అని అన్నారు. బహుజనుల పై జరిగే దాడులు, అన్యాయాలు, అక్రమాల పై పోరాటం చేయడానికి అవకాశం ఉంటుంది అని అన్నారు. రాజ్యంగ రక్షణకు బి ఎస్ పి పార్టీ దోహదం చేస్తుంది అని అన్నారు. నేను మీ వెంట ఉంటా నీ సమస్యలపై పోరాడుతానని ఈ సందర్భంగా వారికి హామీ ఇచ్చినట్లు తెలిపారు.