నిఘా నీడలో కొత్తూరు

నేర రహిత సమాజ స్థాపనే ప్రభుత్వ ధ్యేయం
షాద్‌నగర్‌ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్‌
ఒక్క సీసీ కెమెరా వంద
మంది పోలీసులతో సమానం
శంషాబాద్‌ డీసీపీ నారాయణరెడ్డి
కొత్తూరు పోలీస్‌ స్టేషన్‌లో
సీసీకెమెరాల ప్రారంభోత్సవం
నవతెలంగాణ-కొత్తూరు
నేర రహిత సమాజ స్థాపనే ప్రభుత్వ ధ్యేయమని షాద్‌నగర్‌ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్‌ అన్నారు. కొత్తూరు సీిఐ బాలరాజు ఆధ్వర్యంలో శుక్రవారం కొత్తూరు పోలీస్‌స్టేషన్‌ పరిధిలో వైర్‌ లెస్‌ కమ్యూనిటీ సీసీ కెమెరాల ప్రారంభోత్సవ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమా నికి ముఖ్య అతిథులుగా షాద్‌నగర్‌ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్‌, శంషాబాద్‌ డీసీపీ నారాయణరెడ్డి, ఏసీబీ భాస్కర్‌గౌడ్‌ హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. గతంతో పోల్చుకుంటే టెక్నాలజీ ఎంతో మెరుగుపడిందని అందుకు సీఎం కేసీఆర్‌ ఎంతో కృషి చేశారని అన్నారు. పోలీస్‌ శాఖలు ఎన్నో మార్పులను తీసుకువచ్చి నేరాలను త్వరగా చేదించేందుకు వీలుగా అనేక సదుపాయాలను సమకూర్చారని తెలిపారు. నేరం జరిగిన స్పాట్‌కు త్వరగా చేరుకునే విధంగా వాహనాలు అందించారని తెలిపారు. నేరాలను తగ్గించడంలో సీసీ కెమెరాల పాత్ర ఎంతో ముఖ్యమైనదని అన్నారు. అనం తరం డీసీపీ నారాయణరెడ్డి మాట్లాడుతూ… తెలంగాణ రాష్ట్రంలో డీజీ, సీపీలు సీసీ కెమెరాల ఏర్పాటు చేయడానికి మంచి వాతావరణాన్ని నెలకొల్పారని తెలిపారు. రాష్ట్రంలో ఒక ఉద్యమంలో తీసుకొని నేటికీ పది లక్షల సీసీ కెమెరా లను రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పాటు చేశారని అన్నారు. ఒక్కో సీసీ కెమెరా వంద మంది పోలీసులతో సమానమని అన్నా రు. సీసీ కెమెరాల ఏర్పాటుకు సహకరించిన ప్రజాప్రతి నిధులు, వ్యాపారులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. సీసీ కెమెరాల ఏర్పాటు కృషి చేసిన సిఐ బాలరాజు, సిబ్బందిని ఆయన అభినందించారు. అనంతరం కొత్తూరు పోలీస్‌ స్టేషన్‌ సిబ్బందిని ఎమ్మెల్యే అంజయ్యయాదవ్‌, ఏసీపీ భాస్కర్‌గౌడ్‌లు శాలువాలతో సన్మానించి నగదు పురస్కారా న్ని అందించారు. ఈ కార్యక్రమంలో ఎస్సై శంకర్‌, ఎస్సై సయ్యద్‌, తహసీల్దార్‌ రాములు, ఎంపీడీవో శరత్‌ చంద్రబా బు, జిల్లా పరిషత్‌ వైస్‌ చైర్మన్‌ ఈట గణేష్‌, మున్సిపల్‌ వైస్‌చైర్మన్‌ డోలి రవీందర్‌, కౌన్సిలర్‌ కోస్గి శ్రీనివాస్‌, ఎం పీటీసీ చింతకింది రాజేందర్‌గౌడ్‌, నాయకులు ఎమ్మె సత్యనారాయణ, బాతుక దేవేందర్‌ యాదవ్‌, మెండే కృష్ణయాదవ్‌, పెంట నోళ్ళ యాదగిరి, మల్లాపూర్‌ సర్పంచ్‌ చిర్ర సాయిలు, మక్తగూడ సర్పంచ్‌ రాజు పాల్గొన్నారు.

Spread the love