ఏర్గట్ల మండలంలో కేటీఆర్ జన్మదిన వేడుక

నవతెలంగాణ-ఏర్గట్ల
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకుని మండలకేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం వద్ద నాయకులు,కార్యకర్తలు కేక్ కట్ చేసి పెద్ద ఎత్తున సంబరాలు జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ మండలాధ్యక్షులు పూర్ణానందం, మాజీ ఎంపీపీ ఉపేంధర్ రెడ్డి,మాజీ ఎంపీటీసీ జక్కని మధుసూదన్, ఏర్గట్ల, తాళ్ళ రాంపూర్ పీఏసీఎస్ చైర్మన్లు బర్మ చిన్న నర్సయ్య, పెద్దకాపుల శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Spread the love