నమ్మిన పాపానికి ఓటర్ల పేరు చెప్పి లక్షలు స్వాహా..

– బీఅర్ఎస్ పార్టీ అభ్యర్థిని నిండా ముంచిన కౌన్సిలర్లు..!?
– గంప గుత్తగా బిజెపికి ,కాంగ్రెస్ కి ఓట్లు వేసిన మహిళలు..
– ఓటర్లకు అందని డబ్బులు.. లక్షలు స్వాహా
నవతెలంగాణ – వేములవాడ
బీఆర్ఎస్ వేములవాడ ఎమ్మెల్యే అభ్యర్ధి చల్మేడ లక్ష్మి నరసింహరావును పార్టీకి చెందిన కొందరు కౌన్సిలర్లు, నాయకులు నిండా ముంచినట్లు పట్టణంలో జోరుగా ప్రచారం జరుగుతుంది. నమ్మిన పాపానికి ఓటర్ల పేరు చెప్పి లక్షలు స్వాహా చేసినట్లు తెలిసింది. డబ్బుల పంపిణి విషయంలో తమ వార్డులోని ప్రజలు కౌన్సిలర్లలను నిలదిసిన సంఘటనలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. దీంతో కౌన్సిలర్లు తాము తీసుకున్న లక్షల రూపాయలకు లెక్కలు చెప్పలేక తలలు పట్టుకుంటున్నారు అని విమర్శలు వినిపిస్తున్నాయి. వార్డు ప్రజల పేరు చెప్పి లక్షల రూపాయలు తెచ్చుకొని కొంత మంది ఓటర్లకు మాత్రమే డబ్బులు పంచినట్లు ఆరోపణలు గట్టిగానే వినిపిస్తున్నాయి.ముఖ్యంగా పట్టణంలోని 7వ వార్డుకు చెందిన ఓ ముఖ్య నాయకుడు ఓటర్లకు పంచాల్సిన డబ్బులను తానే కాజేసినట్లు బహిరంగంగానే మాట్లాడుకుంటున్నారు. విషయం తెలుసుకున్న ఓటర్లు ఆ నాయకుడిని నిలదీయడంతో పార్టీ నుండి తనను ఒక్క రూపాయి కూడా రాలేదని,మీ ఇష్టమచ్చిన పార్టీకి ఓటు వేసుకొండని మండిపడినట్లుగా అక్కడి ప్రజలు చెపుతున్నారు. సంకపల్లికి చెందిన ఓ ముఖ్య నాయకుడు, చింతల్ ఠా నా ఓ నాయకుడు మందు, డబ్బులు ఓటర్లకు  పంపిణీ  చేయకుండా తన వద్దని ఉంచుకొని ఒక్క రూపాయి కూడా బయట ఓటర్లకు పంచకుండా తన వద్దని అట్టిపెట్టుకున్నాడని ఆ గ్రామాల ఓటర్లు తాము గప్పగుత్తగా కాంగ్రెస్ బిజెపికి పార్టీకి ఓటు వేసినట్లు తెలుస్తోంది. దీంతో తాము గప్పగుత్తగా కాంగ్రెస్, బీజేపీ పార్టీలకు ఓటు వేసినట్లు తెలుస్తోంది. పార్టీ అభ్యర్ధి చల్మెడ లక్ష్మీ నరసింహారావు నమ్మిన పాపానికి కౌన్సిలర్లు బుద్ధి చూపించారని, లక్షలు తీసుకున్న నాయకులే ఆయనను ఓటమి పాలు చేసేందుకు పెద్ద ఎత్తున కుట్రలు చేసినట్లు ప్రచారం జరుగుతుంది. బీఅర్ఎస్ పార్టీలోనే ఉంటూ ఇతర పార్టీలకు మేలు చేశారనేది స్పష్టంగా కనిపిస్తుంది. చల్మేడను అభ్యర్థిగా ప్రకటించిన్నప్పటి నుండి పార్టీలోని కొంత మంది నాయకులు, కౌన్సిలర్లు కేవలం డబ్బులు సంపాదించుకోవడం కోసం తప్ప పార్టీ గెలుపు కోసం కష్టపడి పని చేయలేదని స్పష్టమయింది.నమ్మిన నాయకులే పార్టీని ఓడించేందుకు కుట్రలు చేయడంపై చల్మేడ అవేదన వ్యక్తం చేసినట్లు తెలిసింది. ఎవరేన్ని ఇబ్బందులు పెట్టిన ప్రజలపై తనకు పూర్తి విశ్వాసం ఉందని, ఆదివారం 3వ తేదీన వెలువడే ఎన్నికల ఫలితాల్లో తాను వేములవాడ ఎమ్మెల్యేగా విజయం సాధిస్తానని చల్మేడ ధీమా వ్యక్తం చేస్తున్నట్లుగా అతని దగ్గర అనుచరులు చర్చించుకుంటున్నారు..పార్టీకి నష్టం కలిగించే విధంగా పని చేసిన వారిపై త్వరలో క్రమశిక్షణ చర్యలు తీసుకుంటారని తెలియ వచ్చింది..
Spread the love