Saturday, May 2, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్సేవాలాల్ మహారాజ్ గుడి నిర్మాణానికి భూమి, నిధులు కేటాయించాలి

సేవాలాల్ మహారాజ్ గుడి నిర్మాణానికి భూమి, నిధులు కేటాయించాలి

- Advertisement -

నవతెలంగాణ –  కామారెడ్డి 
బంజారాహిల్స్ లో నిర్మించే సేవాలాల్ మహారాజా గుడి నిర్మాణం కి భూమి, నిధులను  కేటాయించాలని గిరిజన విద్యార్థి సంఘం నాయకులకు కోరారు. ఈ సందర్భంగా శనివారం కామారెడ్డి జిల్లాలో  కరపత్రాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ హైదరాబాదు బంజారాహిల్స్ లో  సేవాలాల్ మహారాజ్ గుడి నిర్మాణానికి 100  ఎకరాలు  భూమి కేటాయించి 1000 కోట్ల నిధులు  విడుదల చేయాలన్నారు.

తెలంగాణ రాష్ట్రంలో లంబాడీల జనాభా మూడో స్థానంలో ఉందని జనాభా అనుగుణంగా లంబాడీలను ఆత్మ గౌరవాన్ని కాపాడేందుకు లంబాడీల హక్కుల పోరాట సమితి, గిరిజన విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో మే 19న రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇంటి ముందు నిరసన ధర్నా కార్యక్రమం ఉంటుందని, 30న సడక్ బంద్ శ్రీశైలం హైవేపై నిరసన కార్యక్రమం ఉంటుందని, జూన్ 15న కొండారెడ్డిపల్లె నుండి మహా పాదయాత్ర కొనసాగి హైదరాబాద్ అమరవీరుల స్తూపం వద్ద ముగింపు ఉంటుందని రాష్ట్ర ఉపాధ్యక్షుడు,  కామారెడ్డి జిల్లా అధ్యక్షులు గిరిజన విద్యార్థి సంఘం సభావాత్ వినోద్ నాయక్, లంబాడి హక్కుల పోరాట సమితి జిల్లా అధ్యక్షులు నేనావాత్ గణేష్ నాయక్ లు తెలిపారు. 

తెలుగు రాష్ట్రాలలో లక్షల కోట్లు కేటాయించిన దేవాలయాలను నిర్మానించిందని, ప్రతి గ్రామంలో దేవాలయాలు దర్శనమిస్తాయి కానీ లంబాడి ఆరాధ్య దైవమైన సేవలాల్ మహారాజ్ దేవాలయాల కు ఎటువంటి నిధులు కేటాయించలేదని లంబాడి బంజారా సంఘాలు డిమాండ్ చేశాయి. మా యొక్క జాతికి చెందినటువంటి సేవాలాల్ మహారాజ్ ఆవులను మేపి మా లంబాడి ఆస్త వ్యవస్థలను   చుట్టుపక్కల తండా గుడారాలను నిర్మాణం చేసి చైతన్యవంతం కల్పించిన  లంబాడి లను ఒక్కతాటిపైకి తెచ్చి  ఐక్యత చేసిన  సేవాలాల్  మహారాజ్ లాంటి  మహాపూర్వికులు మా బంజారాలు నివసించిన బంజారాహిల్స్ లోనే  జగజంబయాడి సేవాలాల్ మహారాజ్ గుడి నిర్మాణం చేయాలన్నారు. ప్రభుత్వానికి (జీవీస్ )గిరిజన విద్యార్థి (  ఎల్ హెచ్ ఆర్ ఎస్  ) సంఘం, లంబాడి హక్కుల పోరాట సమితి ప్రజా సంఘాలు   ధరావత్ మోతిరాం నాయక్, వెంకన్న, సర్పంచ్ సదర్ నాయక్, మాజీ ఎంపిటిసి శీను నాయక్, దేవిసింగ్ నాయక్, కైలాస్ నాయక్, అడ్వకేట్  అసోసియేషన్ సిద్ధిరాములు, ఆజాద్, వివిధ సంఘాల నాయకులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -